– నందమూరి బాలకృష్ణ
స్వర్గీయ నందమూరి తారకరామారావు గారికి అత్యంత సన్నిహితుడు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రెడ్డి గోవిందరావు అకాల మరణం బాధాకరం. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరుకు చెందిన రెడ్డి గోవిందరావు డిసిఎంఎస్ చైర్మన్గా గ్రామీణ ప్రాంత సమస్యల పరిష్కారానికి, తూర్పుగోదావరి జిల్లా సర్పంచులు సమైక్య అధ్యక్షులు సర్పంచుల సమస్యలపై చేసిన పోరాటం చిరస్మరణీయం. గ్రామీణ సమస్యలు, ప్రజా సమస్యలపై నిత్య పోరాటం చేసే గోవిందరావు లాంటి మహనీయుడిని కోల్పోవడం తీరని లోటు. వారి కుటుంబానికి ఆ దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలి. గోవిందరావుగారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా