– నారా చంద్రబాబు నాయుడు
విజయనగరం జిల్లా గజపతినగరం మండలం గంగచోళ్లపెంట మాజీ సర్పంచ్, గజపతి నగరం మండల మాజీ వైస్ ఎంపీపీ కనకల పోలినాయుడి మృతి అత్యంత బాధాకరం. తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తగా నియోజకవర్గంలో పార్టీ అభ్యున్నతి, పటిష్టత కోసం చేసిన కృషి అజరామరం. పోలినాయుడు లాంటి సీనియర్ నాయకుల మరణం పార్టీకి తీరనిలోటు. పోలినాయుడి ఆత్మకు శాంతి కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అతని కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. కుటుంబానికి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా.