– రాడిసన్ బ్లూ తో నాకు సంబంధం లేదు
– ప్రభుత్వ అరాచకాన్ని అంతం చేయటం మా లక్ష్యం
– ఏపీలో అరాచకాలకు ఎలా అడ్డు కట్ట వేస్తామో చూస్తారు
– ప్రభుత్వ అరాచకాలపై ఫిర్యాదు చేయండి. చర్యలు ఎలా ఉంటాయో చూస్తారు
– జగన్ సర్కారుపై సుజనాచౌదరి సంచలన వ్యాఖ్యలు
విశాఖ : ‘ దేశ ముద్దుబిడ్డల్లో వాజపేయి ఒకరు. వాజపేయి వేసిన బాటలోనే మోడీ నడుస్తున్నారు. AP లో రాక్షస పాలన నడుస్తుంది. అభివృద్ధి లో 30 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయింది. భవిష్యత్ కోసం పోరాడాలి. ఆడిటర్ జీవి గురించి నాకు తెలియదు. దారిన పోయే దానయ్య ఎదో కామెంట్స్ చేస్తే, నేనేమి స్పందిస్తాను. రాడిసన్ బ్లూ తో నాకు సంబంధం లేదు ’ అని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. సుపరిపాలన దినోత్సవం సందర్భంగా విశాఖలో ఏర్పాటుచేసిన సెమినార్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
సుజనా ఏమన్నారంటే.. స్టీల్ ప్లాంట్ పై విధాన పరమైన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో మంచి వార్త స్టీల్ ప్లాంట్ విషయం లో వింటారు. ఏపీలో రాజకీయం ఎలా మారబోతోందో, అరాచకాలకు ఎలా అడ్డు కట్ట వేస్తామో చూస్తారు. ఇంకా 30 నెలల సమయం ఉంది. మేము ఏం చేస్తామో, ఏం చేయగలమో, మా సమర్ధత, సామర్ధ్యం చూస్తారు.
వైసీపీ పార్టీ లో ఉన్నవారికి భద్రతా లేదు. సినిమా హాల్స్, టిక్కెట్లు ధరపై ఇప్పటికే కోర్టు స్పష్టం చేసింది..సినిమా హాల్స్ మూతపడితే దానిమీద ఆధారపడి ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.విభజన చట్టం ప్రకారం మనకు ఇవ్వాల్సినవి రాష్ట్ర ప్రభుత్వం అడగాలి.కానీ వాళ్లకు ఉన్న లొసుగులు వల్ల అడగలేక పోతున్నారు.
తల తోక లేకుండా రాష్ట్రం లో పాలన సాగుతుంది.విశాఖ రైల్వే జోన్ కోసం ఇక్కడి ఎంపీ అడగటం లేదు.రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్రం ఒక కన్నేసింది.రాజ్యాంగం ప్రకారం పాలన చెయ్యకపోతే వారికి ఇబ్బందులు తప్పవు. పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ విషయం పై కేంద్రం ను కలుస్తా అంటే మేము ఆయనతో మా అధిష్ఠానం ను కలుస్తాము.
రాజకీయాలు చేసే చోట నేను వ్యాపారం చేయను . నాకు 12 ఏళ్లుగా వ్యాపారాలతో సంబంధం లేదు. పరీక్షలో తెల్ల కాగితం ఇచ్చేసి పేపర్ దిద్దే వాళ్లే పాస్ చేయాలని డిమాండ్ చేసినట్టు ఉంది రాష్ట్ర ప్రభుత్వం తీరు. కేంద్రాన్ని ఏం అడిగారు ? రాష్ట్రం నుంచి ఈ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఏంటి ? ఏం చేయలేదో చెప్ప మనండి. కేంద్రం ఏపీకి ఏం ఇచ్చిందో నేను చెబుతా .
ap ప్రభుత్వ అరాచకాన్ని అంతం చేయటం మా లక్ష్యం. Ap ప్రభుత్వం కనీసం చొరవ చూపిస్తే… ఢిల్లీలో కేంద్రం స్పందిస్తుంది. ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేసింది.కేంద్రం అన్నీ చూస్తోంది, అరాచకం తో చేతులు కలిపినవాళ్లు మూల్యం చెల్లించాల్సిందే. సభలో సమగ్రంగా బిల్లులు పెట్టడం కూడా చేతకాని ప్రభుత్వం ఇది.
ఓనమాలు తెలియవు, హెడ్ అండ్ టెయిల్ లేని ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వ అరాచకాలపై ఫిర్యాదు చేయండి. చర్యలు ఎలా ఉంటాయో చూస్తారు. వచ్చే ఎన్నికల్లో మేం వచ్చి తీరుతాం … రాసి పెట్టుకోండి, ఈ ప్రభుత్వం ఉండదు. విశాఖ ఉక్కు ఎమోషనల్ అంశం, పోరాడి సాధించాలి, కేంద్రానికి వాదం వినిపించడంలో ముందు ఉంటా.