– ఎన్నికల షెడ్యూల్ విడుదల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు నగారా మోగింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. హైదరాబాద్ లోని ఏసీ గార్డ్స్ నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల అధికారి మాట్లాడుతూ, అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. 31 జిల్లాల్లో 565 మండలాల్లో 5749 ఎంపీటీసీ, 656 జెడ్పీటీసీ స్థానలకు ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు.