– బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్
అనకాపల్లి: అగ్రరాజ్యం ఆర్థిక పెత్తనానికి చరమగీతం పాడాలని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. సారథ్యం యాత్ర లో భాగంగా బీజేపీ కార్యకర్తలు సమావేశం గురువారం ఇక్కడ జరిగింది. సమావేశంలో మాధవ్ మాట్లాడారు. ట్రంప్ పన్ను విధానం పై మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్వయం సమృద్ధి భారత్ గా మారాలి అందుకు తగిన విధంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చర్యలు తీసుకుంటున్నారు. మేకిన్ ఇండియా స్పూర్తి తో పని చేయాలి. స్వదేశీ ఉద్యమం ద్వారా మన ఉత్పత్తులు వినిమయం ఇక్కడ పెరగాలి. రైతు ఉత్పత్తులు ఎగుమతి లకు కొత్త దారులు వెదకాలి అన్నారు.
అనకాపల్లి లో బీజేపీ బలోపేతం అయింది. మనకు నాయకత్వం కొరత లేదు. ప్రజానాయకులు మన పార్టీ లో ఉన్నారు. మా తండ్రి సమయం నుండి అనకాపల్లి లో పాగా వేయాలని అనుకున్న సీఎం రమేష్ ఎంపీ గా గెలవడం ద్వారా అనకాపల్లి బీజేపీ అడ్డా గా మారింది. ప్రతి గ్రామంలో మనవూరు మన జెండా కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. సమావేశం లో ఎంపీ సిఎం రమేష్, తదితరులు ప్రసంగించారు.