-కోర్టు వాయిదాలకు అలవాటు పడ్డ మీరు పరీక్ష ఫలితాలు వాయిదా వేస్తే ఎలా జగన్ రెడ్డి?
-మంత్రి బొత్సకు తన వైన్ షాపుల సంఖ్య తప్ప రాష్ట్రంలో పాఠశాలల సంఖ్య తెలుసా ?
-10 వ తరగతి పరీక్ష పలితాల వాయిదాపై విద్యార్దులకు సమాధానం చెప్పండి
-తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తన చేతకాని, అసమర్ధ పాలనతో రాష్ట్రంలో విద్యారంగాన్ని భ్రష్టుపట్టించారు. నేడు విడుదల కావాల్సిన పదవ తరగతి పరీక్ష పలితాలు వాయిదా వేయటమే అందుకు నిదర్శనం. నేడు ఫలితాలు వస్తాయని 6 లక్షల మంది విధ్యార్ధులు ఎంతో ఆశతో ఎదురు చూశారు. ముందుగానే పరీక్ష పలితాలు విడుదల చేస్తామని చెప్పి చివరి నిమిషంలో వాయిదా వేయటం ఏంటి? ఇది అధికారులు, మంత్రి మధ్య సమన్వయ లోపమా? లేక జగన్ రెడ్డి ప్రభుత్వ చేతకానితనమా? విద్యార్దులకు, వారి తల్లితండ్రులకు ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి సమాధానం చెప్పాలి. కోర్టు వాయిదాలకు అలవాటు పడ్డ ముఖ్యమంత్రి పరీక్ష పలితాలు వాయిదా వేయటం ఎంతవరకు సమంజసం? మీ అసమర్ద పాలనతో విధ్యార్ధుల భవిష్యత్ తో చెలగాటమాడుతారా? మద్యం వ్యాపారం చేసుకునే వ్యక్తిని…జగన్ రెడ్డి విద్యాశాఖ మంత్రిని చేశారు. విజయనగరం జిల్లాలో ఉన్న తన వైన్ షాపుల సంఖ్య తప్ప రాష్ట్రంలోని పాఠశాలల సంఖ్య మంత్రి బొత్స సత్యనారాయణకు తెలుసా?
వైసీపీ 3 ఏళ్ల పాలనలో జగన్ రెడ్డి తన అనాలోచిత, అహంకారపూరిత నిర్ణయాలతో విద్యార్దుల భవిష్యత్ తో ఆటలాడుతున్నారు. కరోనా సమయంలో విద్యార్దుల ప్రాణాలు పణంగా పెట్టి బలవంతంగా పరీక్షలు నిర్వహించేందుకు సిద్దయ్యారు. ఎయిడెడ్ ఆస్తుల కోసం ఆ వ్యవస్ధను నిర్వీర్యం చేశారు. కరోనా సమయంలో మందు షాపుల ముందు ఉపాధ్యాయులను కాపలా పెట్టి ఉపాద్యాయ వృత్తిని దిగజార్చారు. జగన్ రెడ్డి పాలనలో పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు దిగజారాయి. నాడు నేడు పేరుతో కమీషన్లు దండుకోవటం తప్ప విద్యాభివృద్దికి జగన్ రెడ్డి చేసిన కృషి శూన్యం.