– నిరుద్యోగం తగ్గితే ఏడాదిలోనే 385 మంది నిరుద్యోగులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు?
– ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా రాష్ట్రంలో నిరుద్యోగం ఎలా తగ్గిందో వైసీపీ చెప్పాలి
– వాలంటీర్ పోస్టులు , వైసీపీ నేతలకు నామినేటెడ్ పోస్టుల భర్తీతో నిరుద్యోగం తగ్గిందా?
– టీడీపీ శాసనమండలి సభ్యులు అశోక్ బాబు
రాష్ట్రంలో నిరుద్యోగం తగ్గిందంటూ వైసీపీ నేతలు, వైసీపీ మీడియా నిస్సిగ్గుగా అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్ అబ్దదపు ప్రచారాలు చేస్తూ రాష్ట్ర ప్రతిష్టతను దిగజార్చుతున్నారు. నిరుద్యోగం ఏవిధంగా తగ్గిందో వైసీపీ చెప్పాలి. వాలంటీర్ పోస్టులతో రాష్ట్రంలో నిరుద్యోగం తగ్గిందా? లేక వైసీపీ నేతలకు ఇచ్చిన నామినేటెడ్ పోస్టులతో నిరుద్యోగం తగ్గిందా ?
నిరుద్యోగం తగ్గితే ఒక్క ఏడాదిలోనే 385 మంది నిరుద్యోగులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో చెప్పాలి? సెంటర్ పర్ మానిటర్ ఇండియన్ ఎకానమీ నివేదిక ప్రకారం చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగే 2019 ఏప్రిల్ నాటికి రాష్ట్రంలో 4.0 మాత్రమే నిరుద్యోగం ఉంటే.. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో జగన్ చేతకానితనంతో 2020 ఏప్రిల్ నాటికి 20.5 శాతానికి పెరగటం వాస్తవం కాదా?
రాష్ట్రంలో 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలున్నాయని అధికారంలోకి వచ్చిన వెంటనే భర్తీ చేస్తామని ప్రతిపక్షంలో ఉన్నపుడు అన్న జగన్ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు కావొస్తున్నా ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకురాకపోగా కమీషన్ల కోస పెట్టుబడిదారుల్ని బెదిరించి ఉన్న పరిశ్రమల్ని పొరుగు రాష్ట్రాలకు తరిమేశారు. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా, రాష్ట్రానికి కొత్తగా ఒక్క పరిశ్రమ తీసుకురాకుండా నిరుద్యోగం ఎలా తగ్గుతుంది?