Suryaa.co.in

Telangana

కాళేశ్వరం కూలిందనే దుష్ప్రచారం మానుకోవాలి

– పాలమూరు ప్రాజెక్టులు, కాళేశ్వరంపై అసెంబ్లీలో మాజీమంత్రి హరీశ్ రావు

హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లాలో ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని చెప్పారు. ఇది పూర్తిగా సత్యదూరమైనది. మహబూబ్ నగర్ జిల్లాలో నేను నీటిపారుదలశాఖ మంత్రిగా ప్రాజెక్టుల దగ్గరికి వెళ్లిన అక్కడే నిద్రచేసిన.

పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ హయాంలో 4 వేల కోట్ల రూపాయలు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టి 10 లక్షల ఎకరాల ఆయకట్టును తేవడం జరిగింది.

అదే విధంగా.. కాళేశ్వరం విషయంలో కూడా అధ్యక్షా… కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సుందిళ్ల, అన్నారం బ్యారేజీలను ఉంచాలా, కూల్చాలా అన్నది ఎన్.డి.ఎస్.ఏ వాళ్లు చెప్పాలన్నరు. కౌన్సిల్లో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సుందిళ్ల, అన్నారం సేఫ్ గా ఉన్నది, అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు.

ఇవాళ కాళేశ్వరం కూలిందనే తప్పుడు ప్రచారం సరికాదు అధ్యక్షా. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 16 రిజర్వాయర్లు. 203 కి.మీ. టన్నెల్, 231 కి.మీ.గ్రావిటీ కెనాల్. ఇవన్నీ బాగున్నయి. కేవలం ఒక్క మేడిగడ్డలోని 7 బ్లాకుల్లోని 1 బ్లాకులో, 1 పిల్లర్ మాత్రమే కుంగింది.

ఇంతమాత్రాన మామీద కోపంతో కాళేశ్వరం కూలిందని దుష్ప్రచారం చేయడం సరికాదు. దీంతో రాష్ట్రానికి నష్టం జరుగుతది. కాళేశ్వరం కూలిందనే దుష్ప్రచారం మానుకోవాలి. సభ రికార్డులు సరిచేయాలని కోరుతున్నా.

LEAVE A RESPONSE