-అన్ని పోలింగ్ బూత్ లలో ప్రతిజ్ఞ కార్యక్రమాలు
-తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయడం ఖాయం
-బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి & తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ ఛుగ్
భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ సభ్యులతో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి & తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ ఛుగ్ వర్చువల్ గా మాట్లాడడం జరిగింది. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్ర పర్యాటక సాంస్కృతిక ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, పార్లమెంటరీ బోర్డు మెంబర్ డాక్టర్ కే లక్ష్మణ్, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతోపాటు బిజెపి కోర్ కమిటీ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు తదితర నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కోర్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతూ నియంత ధోరణితో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ని అరెస్టు చేశారని దానిని బిజెపి కార్యకర్తలు నాయకులు ఎదుర్కొంటామని ఎలాంటి బెదిరింపులకు దాడులకు భయపడేది లేదని రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని, రేపు అన్ని పోలింగ్ బూత్ లలో ప్రతిజ్ఞ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.
ఈరోజు అదే విధంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బిజెపి రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్చార్జులు ఇతర ముఖ్య నాయకులతో మాట్లాడడం జరిగింది. పార్టీ నాయకులందరూ ముక్తకంఠంతో బిఆర్ఎస్ ప్రభుత్వ నియంత ధోరణి, అప్రజాస్వామికి చర్యలను ప్రజల మధ్య తీసుకెళ్తామని ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు పోరాటంలో ఉధృతం చేస్తామని, పరీక్ష పత్రాలు లీక్ కావడంతో 30 లక్షల మంది నిరుద్యోగ యువత భవిత అంధకారంలోకి నెట్టిందని, పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళనలో ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించడం జరిగింది.
బిఆర్ఎస్ ప్రభుత్వం పతనం దిశగా పయనిస్తూ నిస్సహాయ స్థితిలో బిజెపిని కార్యకర్తలను నాయకులను టార్గెట్ చేస్తూ భయాందోళన గురి చేయాలని తద్వారా బిఆర్ఎస్ పార్టీ లబ్ధి పొందాలన్నా ఆలోచన ఉంది. తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయడం ఖాయం.