నవ భూభాగంగా పేరుపొందిన (గ్రీన్ లాండ్) కేవలం మంచు ఖండం మాత్రమే కాదు, అది అపారమైన సహజ వనరులకు నిలయం. దీంతో అక్కడి ఖనిజ సంపదపై అమెరికా కన్ను పడింది. అందుకే గ్రీన్ లాండ్‌ను కొనుగోలు చేస్తామని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ 2019లోనే ప్రకటించారు. ఈ ప్రతిపాదనను గ్రీన్ లాండ్ తీవ్రంగా వ్యతిరేకించగా, ఆ దేశంపై కొత్త సుంకాలు విధిస్తామని కూడా ట్రంప్ హెచ్చరించారు.
అప్పట్లో ‘‘నాటో’’ చొరవతో ఈ వివాదం కొద్దికాలం సద్దుమణిగినా, మళ్లీ ఇటీవలి కాలంలో గ్రీన్ లాండ్ పై పట్టు సాధించడానికి అమెరికా తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తూనే ఉన్నది.మరోవైపు, అమెరికా చర్యలను గమనిస్తున్న నాటో మిత్రదేశా లైన కెనడా, ఫ్రాన్స్.. డెన్మార్క్‌కు మద్దతు గా గ్రీన్ లాండ్ రాజధాని ‘నూక్’లో తమ దౌత్య కార్యాలయాలనుతెరవబోతు న్నాయి.సాంస్కృతిక, శాస్త్రీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడమే వీటి ప్రధాన లక్ష్యం.
గ్రీన్ లాండ్లో బంగారం యురేని యంతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీకి అవసరమైన అరుదైన ఖని జాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఖనిజాల కోసం చైనాపై ఆధారపడు తున్న అమెరికా, ఆ డిపెండెన్సీని తగ్గిం చుకోవడానికి గ్రీన్ లాండ్‌ను కీలకంగా భావిస్తోంది.అంతేకాకుండా, ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా, చైనాల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో, వ్యూహాత్మక రక్షణ పరంగా గ్రీన్ లాండ్ అమెరికాకు ఎంతో ముఖ్యం. గతంలో ట్రంప్ చేసిన కొనుగోలు ప్రతిపాదనను డెన్మార్క్ “అసంబద్ధం” అని కొట్టిపారేయడం ఇరు దేశాల మధ్య దౌత్య ఉద్రిక్తతలకు దారితీసింది.
అయితే, నాటో జోక్యంతో ఆ వివాదం తాత్కాలికంగా ముగిసి నా, గ్రీన్ లాండ్ కోసం అగ్రరాజ్యాల మధ్య పోటీ మాత్రం కొనసాగుతూనే ఉంది.గ్రీన్ లాండ్ రాజధాని నూక్ లో కెనడా, ఫ్రాన్స్ దేశాలు తమ దౌత్య కార్యాలయాలను తెరవాలని నిర్ణయిం చుకోవడం వెనుక లోతైన రాజకీయ కారణాలు ఉన్నాయి. గ్రీన్ లాండ్‌ను అమెరికా కేవలం ఒక వనరుగా లేదా తన సొంత ఆస్తిగా భావించకుండా, అక్కడ ఇతర దేశాల భాగస్వామ్యం కూడా ఉందని స్పష్టం చేయడమే ఈ దేశాల ప్రధాన ఉద్దేశం. అదే సమయంలో డెన్మార్క్ సార్వభౌమాధికారానికి మద్దతు ప్రకటించడం కూడా వీటి మరో లక్ష్యం.
గ్రీన్ లాండ్ స్వయంప్రతిపత్తి కలిగిన దేశమైనప్పటికీ, అది డెన్మార్క్ రాజ్యంలో ఒక అంతర్భాగం. అమెరికా ఒత్తిడి నుండి డెన్మార్క్‌ను రక్షించడానికి ఫ్రాన్స్ తదితర ఐరోపా మిత్రదేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి. కెనడాకు గ్రీన్ లాండ్‌తో భౌగోళిక సామీప్యం ఉండటంతో.. పర్యావరణ మార్పులు, షిప్పింగ్ మార్గాలు, శాస్త్రీయ పరిశోధనల్లో తన ఉనికిని చాటుకోవాలని ఆ దేశం భావి స్తోంది.అమెరికా ఏకపక్ష నిర్ణయాల కు ఈ దౌత్య కార్యాలయాలు ఎంతవరకు అడ్డు కట్ట వేస్తాయనే అంశంపై భిన్నాభిప్రాయా లు ఉన్నాయి.
గ్రీన్ లాండ్లో బహుళ దేశాల ఉనికి ఏర్పడటం వల్ల, అమెరికా ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మిగిలిన దేశాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఈ ప్రాంతాన్ని ఏకఛత్రాధిపత్యం నుండి కాపాడి, ఒక అంతర్జాతీయ సహ కార వేదికగా మారుస్తుంది.అయితే ఆర్థికంగా అమెరికా అందించే భారీ ప్యాకేజీలు లేదా పెట్టుబడుల ముందు కెనడా, ఫ్రాన్స్‌ల దౌత్య కార్యాలయాల ప్రభావం పరిమితంగానే ఉండవచ్చని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇప్పటికే నూక్‌లో తన కాన్సులేట్‌ను పునరుద్ధరించిన అమెరికా, అక్కడ తన పట్టును మరింత బిగించింది. ఏదేమై నా, కెనడా, ఫ్రాన్స్ దేశాల ప్రవేశం గ్రీన్ లాండ్లో అమెరికా దూకుడుకు కళ్లెం వేయగలదు. ఇది ఈ ప్రాంతాన్ని కేవలం అమెరికా-డెన్మార్క్ వివాదంగా కాకుం డా, అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఆర్కిటిక్ అంశంగా మారుస్తుందనడంలో సందేహం లేదు.గ్రీన్లాండ్ కేవలం మం చు పర్వతాలకే కాదు, ఆధునిక సాంకేతి కతకు వెన్నెముక వంటి అరుదైన ఖనిజ నిక్షేపాలకు కూడా అతిపెద్ద కేంద్రంగా ఉం ది. ఈ ఖనిజాల కోసం ప్రస్తుతం అంతర్జా తీయ స్థాయిలో తీవ్ర పోటీ జరుగుతోంది.
గ్రీన్లాండ్లో దాదాపు 36 మిలియన్ టన్నుల అరుదైన ఖనిజ నిల్వలు ఉన్నాయని అంచనా. చైనా తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద నిల్వలు కలిగిన ప్రాంతంగా ఇది అవతరించే అవకాశం ఉంది.ఇక్కడి ‘టాన్‌బ్రీజ్’ అనేది ప్రపం చంలోనే అతిపెద్ద అరుదైన ఖనిజ నిక్షే పాలలో ఒకటి. ఇందులోజిర్కోనియం నియోబియం వంటి అత్యంత విలువైన ఖనిజాలు ఉన్నాయి.అలాగే ‘క్వానెఫ్ జెల్డ్’ అనే మరో నిక్షేపం ఐరోపా అమెరి కా దేశాల పారిశ్రామిక అవసరాలను తీర్చగల సామర్థ్యం కలిగి ఉంది.
ఎలక్ట్రిక్ వాహనాలబ్యాటరీలు స్మార్ట్‌ఫో న్లు విండ్ టర్బైన్లు, క్షిపణి వ్యవస్థల తయారీకి అవసరమైన నియోడైమియం లాంతనం, డిస్ప్రోసియం వంటి అరుదైన ఖనిజాలు గ్రీన్లాండ్లో పుష్కలంగా లభిస్తున్నాయి. ఈ వనరులే గ్రీన్‌లాండ్‌ను ప్రపంచ అగ్రరాజ్యాల మధ్య వ్యూహాత్మక కేంద్రంగా మార్చాయి.ఈ క్రమంలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు పశ్చిమ దేశాలు గ్రీన్‌లాండ్‌పై భారీగా పెట్టుబడు లు పెడుతున్నాయి. అమెరికాకు చెంది న ‘యూఎస్ ఎక్స్పోర్ట్-ఇంపోర్ట్ బ్యాం క్’ గత ఏడాది ‘టాన్‌బ్రీజ్’ ప్రాజెక్ట్ కోసం సుమారు 120 మిలియన్ డాలర్లదాదాపు రూ. 1,000 కోట్లు రుణాన్ని ఆమోదించింది. గ్రీన్‌లాండ్‌పై పట్టు సాధించే దిశగా అమెరికా వేసిన కీలక అడుగు ఇది.
మరోవైపు, ఐరోపా దేశాలు ‘యూరోపియన్ రా మెటీరియల్స్ అలయన్స్’ వంటి సంస్థల ద్వారా గ్రీన్లాండ్ రిసోర్సెస్ వంటి కంపెనీలకు మద్దతు ఇస్తున్నాయి. ‘మాలిబ్డినం’ వంటి వ్యూహాత్మక ఖనిజాల కోసం జర్మన్ కంపెనీలతో ఒప్పందాలు జరిగాయి. ఆస్ట్రేలియాకు చెందిన ‘క్రిటికల్ మెటల్స్ కార్ప్’, కెనడాకు చెందిన ‘అమరోక్ మినరల్స్’ వంటి కంపెనీలు కూడా బంగారం, ఇతర ఖనిజాల వెలికితీతలో చురుగ్గా పాల్గొంటున్నాయి.ప్రస్తుతం ప్రపంచవ్యాప్త అరుదైన ఖనిజాల ప్రాసెసింగ్‌లో చైనాకు 90% పైగా వాటా ఉంది.
గ్రీన్‌లాండ్‌ను తన ప్రభావంలోకి తెచ్చుకోవడం ద్వారా ఈ ఆధిపత్యాన్ని శాశ్వతం చేసుకోవాలని చైనా ప్రయత్నిస్తోంది. అయితే, గ్రీన్లాండ్ ప్రభుత్వం ఇటీవల వ్యూహాత్మక మార్పులు చేసింది. అరుదైన ఖనిజాల అభివృద్ధి విషయంలో చైనాను పక్కన పెట్టి.. అమెరికా, జపాన్ ఐరోపా దేశాలతో చేతులు కలపాలని నిర్ణయించింది. పెట్టుబడులు పెరుగుతున్నప్పటికీ, మౌలిక సదుపాయాల లేమి, పర్యావరణ నిబంధనల వల్ల మైనింగ్ రంగం కొన్ని అడ్డంకులను ఎదుర్కొంటోంది.
గ్రీన్లాండ్ ప్రభుత్వం 2021లో యురేనియం మైనింగ్‌పై నిషేధం విధించింది. దీనివల్ల యురేనియం నిల్వలతో కలిసి ఉన్న అరుదైన ఖనిజాల వెలికితీత క్వానెఫ్జె ల్డ్ ప్రాజెక్ట్ నిలిచిపోయింది. మంచు వేగంగా కరుగుతుండటం వల్ల మైనింగ్ మౌలిక సదుపాయాలకు ముప్పు పొంచి ఉన్నప్పటికీ, ఇది కొన్ని ప్రాంతాల్లో నౌకల ప్రయాణానికి, ఖనిజాల వెలికితీతకు కొత్త మార్గాలను కూడా తెరుస్తోంది.
గ్రీన్లాండ్లోఅమెరికా, చైనా, ఆస్ట్రేలియా కెనడా దేశాల మధ్య జరుగుతున్న ఈ ఖనిజ పోటీ కేవలం ఆర్థిక ప్రయోజనా ల కోసమే కాదు; భవిష్యత్తులో ప్రపంచ సాంకేతిక, రక్షణ రంగాలను ఎవరు శాసిస్తారనేది నిర్ణయించే ఒక “వ్యూహాత్మక యుద్ధం” అని చెప్పవచ్చు.
– గోపాల బాలరాజు
అంతర్జాతీయ పరిణామాల విశ్లేషకులు
73370 82570