– బీజేపీ ఏపీ చీఫ్ పీవీఎన్ మాధవ్
తిరుపతి : ఇక్కడి లక్ష్మీపురం సర్కిల్ వద్ద శ్రీ శంకంరంబాడి సుందరాచారి విగ్రహానికి బీజేపీ ఏపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ మంగళవారం ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలుగు భాష ఒక సైంటిఫిక్ లాంగ్వేజ్ గా అభివర్ణించారు. తెలుగు భాషకు అడ్డుపడే వ్యక్తులపై పోరాటం చేయాలని తీవ్ర స్వరంతో పిలుపు ఇచ్చారు. సుందరాచారి రచించిన మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాటను కీర్తించిన తరువాత మాధవ్ ప్రసంగించారు.
తెలుగు భాష కు వన్నె తెచ్చిన మహనీయుడు సుందరాచారి రచనలు తెలుగు భాషకు జీవం పోశాయని మాధవ్ పేర్కొన్నారు. సుందరాచారి జీవితంలో అనేక వడిదుడుకులు ఎదొర్కొన్నారని, సాహిత్య వేత్తగా ఆయన రచనలు తెలుగు భాషకు సజీవ సాక్ష్యమని తెలిపారు.