Suryaa.co.in

Andhra Pradesh

సచివాలయంలో రాష్ట్ర స్థాయి దిశ కమిటీ తొలి సమావేశం

వివిధ అభివృద్ధి పథకాల అమలు పర్యవేక్షణ పై రాష్ట్ర స్థాయిలో దిశా కమిటీ ఏర్పాటు

వెలగపూడి,నవంబర్,22: రాష్ట్ర స్థాయి దిశ కమిటీ తొలి సమావేశం ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు అధ్యక్షతన బుధవారం వెలగపూడి సచివాలయంలో జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఉప ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి దిశ కమిటీ చైర్మన్ రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి అని, అయితే వారి తరపున ఈ కమిటీకి అధ్యక్షత వహించి రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలు తీరును సమీక్షించే అవకాశాన్నిచ్చినందుకుముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

గ్రామస్థాయిలో అమలు అయ్యే అభివృద్ధి కార్యక్రమాలను సమర్ధంగా పర్యవేక్షించేందుకు ప్రభుత్వ నిధులు వినియోగం సరిగ్గా జరిగేలా చర్యలు చూడడం కోసం ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా ప్రభుత్వం జరిగే కార్యక్రమాల నేపథ్యంలో ప్రతి పైసా సరిగా ఖర్చు జరిగేలా చూడడం కోసం ఈ కమిటీ ఏర్పాటు చేయబడిందని రాష్ట్ర విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీల స్థానంలో రాష్ట్ర జిల్లా స్థాయి దీక్ష కమిటీలను ఏర్పాటు చేయబడ్డాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు సమర్థవంతంగా, పారదర్శకంగా అమలు జరిగేలా చూడడం. ప్రయోజనాలు నిర్ణీత కాలంలో నిరుపేదలకు అందేలా చూడడమే వీటి ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.

రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి అధ్యక్షతన గ్రామీణ శాఖ కమిటీ సభ్యులు ఉంటారని జిల్లాలో ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా నామినేట్ సభ్యులు ఉంటారని తెలిపారు. కేంద్ర రాష్ట్రస్థాయి దిశ పరిధిలోకి 38 ప్రభుత్వ పథకాలపై వీరి పర్యవేక్షణలో ఉంటాయని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. రాష్ట్రస్థాయిలో దిశ కమిటీ సమావేశాలు ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిర్వహిస్తామని అయన పేర్కొన్నారు.

అనంతరం కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో అమలు పరుస్తున్న 38 కేంద్ర సహాయక కార్యక్రమాల అమలు తీరుపై సమగ్ర చర్చ జరిపారు రాష్ట్ర స్థాయి దిశ కమిటీ ఎమినెంట్ పెర్సన్ జివిఎల్ నరసింహారావు, రాష్ట్ర పంచాయితీ రాజ్ & గ్రామీణాభివృద్ది శాఖ కమిషనర్ సూర్య కుమారి, రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ , కమిషనర్ సురేష్ కుమార్, స్రీ శిశు సంక్షేమ శాఖ కమిషనర్ జానకి, సెర్ప్ సీఈఓ ఇంతియాజ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్ తదితరులతో పాటు పలు కేంద్ర పథకాలను అమలు చేసే హెచ్వోడీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE