-టీడీ జనార్దన్
లింగాల: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం తన ఏడాది సుపరి పాలనలో తొలి అడుగులోనే విజయం సాధించినట్టు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు, తెలుగుదేశం పార్టీ రాజకీయ కార్యదర్శి టిడి జనార్ధన్ తెలిపారు. సోమవారం సాయంత్రం స్వగ్రామమైన లింగాల గ్రామంలో సుపరిపాలంలో తొలి అడుగు అను కార్యక్రమంలో పాల్గొని గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకున్న పరిపాలన అనుభవం దృష్ట్యా అనేక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని అనతి కాలంలోనే గాడిలో పెట్టినట్టు పేర్కొన్నారు. అనేక సంక్షోభాలను ఎదుర్కొని సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారించి ఇప్పటికే రాష్ట్రాన్ని పలు రంగాల్లో అభివృద్ధి పథంలో పయనింపజేస్తున్నట్టు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తన అన్న మాట ప్రకారంగా తల్లికి వందనం పథకాన్ని ప్రతి బిడ్డకు వర్తింపజేసినట్టు తెలిపారు. ఇప్పటికే దీపం పథకం ద్వారా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తున్నట్లు, అన్న క్యాంటీన్ పునరుద్ధంప చేసినట్టు తెలిపారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో ప్రతినెలా మొదటి తేదీనే 65 లక్షల మంది లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లను తమ ఇండ్ల వద్దనే అందజేస్తున్నట్టు, ఇది ఒక చరిత్రగా పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ పథకం, యువతకు ఉద్యోగ కల్పన, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పై దృష్టి సారించినట్టు తెలిపారు. రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లే లక్ష్యంగా 86 కోట్ల వ్యయంతో రహదారులను విస్తరించినట్టు తెలిపారు.
ఈ రాష్ట్రంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను వెంటనే రద్దు పరిచినట్టు, రైతు సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా టీడీ జనార్దన్ గ్రామంలో ఇంటింటికి కాలినడకన వెళ్తూ గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముందుగా మండలంలో ఉన్న డ్వాక్రా గ్రూప్ ల బుక్ కిపర్లు తమ సమస్యలను పరిష్కరించవలసిందిగా టిడి జనార్దన్ ఒక వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జనార్దన్ తల్లికి వందనం పథకంపై లబ్ధిదారుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.