– ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో హర్ ఘర్ తిరంగా వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరైన బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు .
హైదరాబాద్: నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్. రాంచందర్ రావు మీడియాతో మాట్లాడారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు గొప్ప పిలుపునిచ్చారు. గత 5 సంవత్సరాలుగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా విజయవంతంగా నిర్వహిస్తోంది.
హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా దేశ ప్రజలందరూ విద్యాసంస్థలు, కాలనీలు, ఇండ్లలో – ప్రతి ఇంటిపై భారత త్రివర్ణ పతాకం ఎగురేయాలి. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా దేశభక్తి భావనతో కార్యక్రమాలు నిర్వహించాలి.
ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వేలాది విద్యార్థులు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొని, తమ ఇండ్లపై జెండా ఎగరేస్తామని తెలిపారు. రేపు ఆగస్టు 14 ఉదయం 10 గంటలకు నెక్లెస్ రోడ్డుపై జరిగే తిరంగా యాత్రలో కుల,మత, ప్రాంతాలకు అతీతంగా వేలాదిగా ప్రజలందరూ పాల్గొనాలని కోరుతున్నా.
హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జెండా ఎగురవేయాలి. భారత సైనికుల త్యాగాలను, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుందాం.
ఆగస్టు 14, 2025 – విభజన గాయాల స్మృతి దినం సందర్భంగా…. భారత విభజన సమయంలో జరిగిన విషాద గాథను రాబోయే తరాలకు తెలియజేసేలా అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతున్నా.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మల్క కొమరయ్య , బిజెపి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ , పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ తదితరులు హాజరయ్యారు.