– జగన్ అవినీతికి సహకరించి కటకటాల్లోకి వెళ్లిన పోలీసులు మంచివారని.. ఏ తప్పు చేయలేదని జగన్ నాతో ఓపెన్ డిబెట్ కు రాగలరా?
– జగన్ అవినీతి ముఠా ఇక్కడ కొట్టేసిన డబ్బులతో టాంజానియా, దుబాయిలాంటి దేశాలకు వెళ్లి స్టీల్ ప్లాంట్ లు పెడుతున్నారు.
– అవినీతి సొమ్మును పరుపుల్లో దాచుకొని దొర్లాడుతున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు
– చేసిన పాపాలను డైవర్ట్ చేసేసేందుకు రప్పా రప్పా అంటూ రెచ్చగొడుతున్నారు
– జగన్ ప్రెస్ మీట్ లో చెప్పినవన్నీ అబద్దాలే.. తప్పులు చేసిన వారిని సుద్దపూసలంటూ చెప్పడం హాస్యాస్పదం
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య
మంగళగిరి: మద్యం కుంభకోణంలో “సిట్ దెబ్బకు జగన్ అవినీతి ముఠా అబ్బా” అంటోంది.. సిట్ విచారణ ముమ్మరం చేయడంతో జగన్ డైవర్షన్ పాలిటిక్స్ కు దిగారు. ఈ మద్యం కుంభకోణంలో అనుమానితులు ఎంతటివారు ఉన్న వారి పాస్ పోర్ట్ లను కోర్టు అనుమతితో వెంటనే సిట్ సీజ్ చేయాలి అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
గత వైసీపీ పాలనలో దేశమంతా డిజిటల్ పేమెంట్స్ నడుస్తుంటే… ఇక్కడ నగదు లావాదేవీలు నడిపి మద్యంలో రూ. 3500 కోట్లకు పైగా కొట్టేసి ఆ డబ్బును దూబాయికి తరలించారని సిట్ దర్యాప్తులో తెలుస్తోంది. కేంద్రం సహకారంతో దుబాయ్ లో ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసి ఈ అవినీతి దోషులను వెంటనే పట్టుకోవాలి. మిథున్ రెడ్డి, చెవిరెడ్డి, కసిరెడ్డిలాంటి వారు వాళ్ల నాయకుడికి తెలియకుండా ఇన్ని కోట్ల అవినీతి చేస్తారా? అసలు లబ్ధిదారు ఎవరో బయటపెట్టి వారిని సిట్ కటకటాల్లోకి నెట్టాలి… ఈ లోపు వారి పాస్ పోర్ట్ లను స్వాధీనపరుచుకొని.. ఈ అవినీతి పిట్టలు విదేశాలకు ఎగిరిపోకుండా చూడాలి.
జగన్ హయాంలో తప్పుచేసిన పోలీసు అధికారులకు చట్టబద్ధంగా శిక్ష తప్పదు. చంద్రబాబు హయాంలో పోలీసులు మెడల్స్ తీసుకుంటే.. జగన్ కు సహకరించిన పోలీసులు కటకటాల్లో మగ్గుతున్నారు. మద్యంలో కొట్టేసిన డబ్బు దుబాయి చేరడానికి మద్యవర్తిత్వం వహించింది రాజ్ కసిరెడ్డి కాదా?… ఈ రాజ్ కసిరెడ్డి ఎవరు? ఇతనికి ఈ బాధ్యతలు అప్పిగించింది ఎవరు? మీరు కాదా జగన్ రెడ్డి? మీరు సై అనకుండా కసిరెడ్డి ఇది చేయగలడా? మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి.. నాది సత్యహరిచంద్ర పాలన, రామ రాజ్యమని నువ్వు చెబుతుంటే ఆశ్చర్యం వేస్తోంది.
రాజ్ కసిరెడ్డి దుబాయికి ఏ పేరుతో వెళ్లాడు..? ఒక మనిషి పేరుమార్చుకొని దొంగ పాస్ పోర్ట్ తో విదేశాలకు వెళ్ళి తిరిగి వచ్చాడంటే అతన్ని నీతిపరుడు అని చెబుతాడా? ఇలాంటి వ్యక్తి నీజాయితీ పరుడా? ఇలాంటి చీటర్ కు రాష్ట్ర ఖజానాను జగన్ రెడ్డి అప్పగించాడు.. దొరికిందే అదునుగా మద్యంలో వేల కోట్లు కొట్టేశాడు. దుబాయిలో శ్రావణ్ రావు కు ఉన్న ఫ్లాట్ లో ఇక్కడ నుండి తరలించిన డబ్బులను బెడ్డులా పర్చుకొని పడుకుంటున్నారట? ఆ నోట్ల కట్టలు ఎక్కడివి? మన రాష్ట్ర ప్రజలవి కాదా? ఐదు కోట్ల ప్రజల సొమ్ము కాదా? ఐదు కోట్ల ప్రజల సంక్షేమానికి వాడాల్సిన సొమ్మును జగన్ రెడ్డి పాలనలో కసిరెడ్డి ఆధ్వర్యంలో దోచుకెళ్లి దుబాయి తీసుకెళితే వారిని జగన్ సుద్దపూసలంటున్నాడు. వారి గురించి నోరు తెరవడు. మద్యం కేసులో జగన్ మౌనం అర్థాంగికారం కాదా?
సిట్ దెబ్బకు జగన్ టీమ్ వణుకుతోంది.. మిథున్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు.. ఒక ఎంపీ మారువేషంలో కలుగుల్లో దాక్కొవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి జగన్ రెడ్డి సమాధానం చెప్పగలడా? ఈ మద్యం కుంభకోణంతో వైసీపీ నేతల ప్రతిష్ఠ పూర్తిగా దిగజారిపోయింది. ఈ అవినీతిలో రేపు ఎవరు కలుగులోకి వెళతారో కటకటాల్లోకి వెళాతారో వారికి బాగా తెలుసు. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. సిట్ దర్యాప్తు పూర్తి అయ్యే వరకు ఈ అవినీతి తిమింగళాలు దేశం విడిచి పారిపోకుండా చూడాలి. ఢిల్లీలో 100 కోట్ల కుంభకోణానికే పెద్ద పెద్ద నేతలు జైలు పాలు అయ్యారు. ఇక్కడి కుంభకోణంతో వైసీపీ పార్టీ ప్రతిష్ఠ మసకబారేసరికి రప్పా రప్పా అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. మద్యం కుంభకోణం ప్రజలు చర్చించుకోకుండా ఉండేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు.
అమాయకులైన ఐపీఎస్ ఆఫీస్ ర్లును అరెస్ట్ చేస్తున్నారని జగన్ ప్రెస్ లో అంటున్నాడు.. నీతో అంటకాగి తప్పుడు పనులు చేసిన వారు అమాయకులు ఎలా అవుతారు జగన్ రెడ్డి? ఐపీఎస్ లు తప్పులు చేస్తే శిక్షించకూడదా? చట్టం వారికి చుట్టమా?.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మీ పాలనలో చట్టం తనపని తాను చేయలేదు.. మీరు చెప్పిన పని చట్టం చేసింది. వీరు నల్లపూసలైతే అన్ని రోజులు రిమాండ్ లో ఉంటారా? న్యాయస్తానాలు ఉన్నాయి కదా? రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి.. చంద్రబాబు పాలన ఎలాంటిదో ఆయన వ్యక్తిత్వం ఏంటో.. గత ఐదేళ్ల జగన్ పాలన ఎలా ఉందో ఆయన వ్యక్తిత్వం ఎంటో ప్రజలు బేరీజు వేసుకోవాలి.