-గంజాయి, డ్రగ్స్ కావాలా…అభివృద్ధి కావాలా?
-మహిళలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలి
-చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకుందాం
-నంద్యాల నిజం గెలవాలి యాత్రలో నారా భువనేశ్వరి
గంజాయి, డ్రగ్స్, నాసిరకం మద్యంతో రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని నారా భువనేశ్వరి ధ్వజమెత్తారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా శుక్రవారం నంద్యాల పట్టణం వెంకటాచలం కాలనీ 34వ వార్డులో కార్యకర్త అబ్దుల్ రహీమ్ కుటుంబాన్ని ఆమె పరామర్శిం చారు. తనకు సంఫీుభావం తెలిపేందుకు వచ్చిన పార్టీ కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడా రు.
వైసీపీ రాక్షస పాలనలో ఏపీని గంజాయి, డ్రగ్స్‌కు కేంద్రంగా మార్చారని వ్యాఖ్యానించారు. ఇసుక మాఫియా, భూకబ్జాలతో వైసీపీ నాయకులు పేట్రేగిపోతున్నారని, గంజాయిని మహిళలకు అలవాటు చేసి ఆ మత్తులో ఉన్న మహిళలపై వైసీపీ దుర్మార్గులు అరాచకాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. మహిళలు ఆలోచించి వైసీపీ దుర్మార్గాలపై తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చా రు. రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతోందని, అది తాగి చనిపోతున్నారన్నారు. వైసీపీ నేతలు తమ జేబులు నింపుకునేందుకు పేదవారికి డ్రగ్స్, గంజాయిని అలవాటు చేస్తున్నారని దుయ్య బట్టారు. పేదల కోసం ఎన్టీఆర్ కిలో బియ్యం రూ.2కే ఇస్తే…చంద్రబాబు అన్న క్యాంటీన్లు ఏర్పా టు చేసి ఆకలి తీర్చారన్నారు.
అన్న క్యాంటీన్లలో ఒక్క ఏడాదిలోనే 7.5 కోట్ల మంది భోజనం చేశారని, అలాంటి అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం క్రూరంగా మూతవేసి పేదల పొట్టకొట్టిం దన్నారు. వైసీపీ మూకలు దాడులు చేస్తున్నా కార్యకర్తలు, నాయకులు అన్న క్యాంటీన్లను సొంతం గా నడుపుతూ పేదల ఆకలి తీరుస్తున్నారన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి అనేక కంపెనీ లు, పెట్టుబడులు తెచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దొరికేలా చేశారని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏపీకి పెట్టుబడులు రాకపోగా ఉన్న కంపెనీలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపో తున్నాయన్నారు. అడ్డగోలుగా పన్నులు వేసి పేద, మధ్యతరగతి ప్రజల జేబులు ఖాళీ చేస్తున్నారని, నిత్యావసరాల ధరలు పెంచి పేదవాడికి పట్టెడన్నం దొరక్కుండా చేస్తున్నారని విమర్శించారు.
వైసీపీ ప్రభుత్వం తమ వైఫల్యాలను చంద్రబాబుకు ఆపాదిస్తున్నారు…వాళ్లకు పెన్షన్లు ఇవ్వడం చేతకాక చంద్రబాబు పెన్షన్లు నిలిపేశారని విషప్రచారం చేస్తున్నారని, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించి తేనే ప్రజలు ప్రశాంతంగా ఉంటారని పిలుపునిచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి అన్ని వర్గాలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.