Suryaa.co.in

Andhra Pradesh

భూతలస్వర్గం అనిపించుకునేలా మన అమరావతి పునర్నిర్మాణం తధ్యం

అమరావతిలో ఉన్నంత విశాలమైన రహదార్లు ఢిల్లీలో కూడా లేవు…భూగర్భ కేబుల్ వ్యవస్థతో ఒక్క కరెంటు వైరు కూడా బయటకి కనిపించకుండా నిర్మించారు.భూమికి పాతికఅడుగుల క్రింద నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థతో దోమలవలన, అపరిశుభ్రతవల్ల వచ్చే రోగాలు అమరావతి దరిదాపుల్లో వినిపించవు….

కనీసం అమెరికాలో కూడా ఇంత పక్కాప్రణాళికతో నిర్మించిన నగరంలేదు. వచ్చే వందేళ్లవరకు నీటికోసం చెన్నై, ముంబై, బెంగుళూరు నగరాల్లా కటకటలాడాల్సిన పనికూడా లేకుండా కృష్ణమ్మఒడ్డున భూదేవిసైతం నివ్వెరపోయేలా…ఆకాశం అచ్చెరువొందేలా …ప్రపంచదేశాలు మనవైపు చూసేలా, భూతలస్వర్గం అనిపించుకునేలా మన అమరావతి పునర్నిర్మాణం తధ్యం.

ఆంధ్రుల రాజధాని అమరావతి కలని నిజంచేయడంకోసమే మన పట్టుదల గా ఉండాలి. కాదు, కూడదు…రాజధానిని మారుస్తాం, అధికారికంగా ప్రకటిస్తాం అని నోటికొచ్చిన కూతలు కూస్తే…అప్పుడుకూడా మనం మేలుకోకపోతే ఇంక…ఆ జంతువులు పెరుగుతున్నాయి, మనం పెరుగుతున్నాం…వాటికి మనకి పెద్ద తేడా ఉండదు…

LEAVE A RESPONSE