– తెలుగు భాషకు జీవం పోసిన వారిని మరువరాదు
– పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్
విజయవాడ: పార్టీ బలోపేతమే మన లక్ష్యం కావాలి… అందుకు అనుగుణంగా పార్టీ బాధ్యతలు తీసుకున్న వారు పార్టీ కి ఇచ్చేసమయం పెంచాలన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారులు, మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, అధికార ప్రతినిధులతో ఒక వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవ్ తెలుగుభాషకు జీవం పోసిన గిడుగురామ మూర్తి జయంతిని పురస్కరించుకుని నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు.
బీజేపీ ఆలోచనా పద్ధతి కేవలం మనకు పార్టీ అందించి బాధ్యతలకు ఎంత సమయం ఇచ్చి పని చేస్తున్నామన్న తీరు పైనే ఆధారపడి ఉంటుంది. పార్టీని బలోపేతానికి సంబంధించిన అంశంలో ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని ఉపయోగించుకోవలసిన అవసరం ఉందని వివరించారు. అదేవిధంగా జాతీయ, రాష్ట్రపార్టీ ఇచ్చే కార్యక్రమాలతో పాటు ప్రతి నెల స్థానిక సమస్యను కూడా తీసుకు పనిచేస్తే స్థానికుల మనసు బీజేపీ వైపు మళ్లుతుందన్నారు. అదేవిధంగా మన జెండా.. మన ఊరు కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో పార్టీ జెండా నిర్మాణం చేయడం, పార్టీ పతాకాన్ని ఆవిష్కరించడం.. వంటి కార్యక్రమాలు ఈ సంవత్సరం అంతా కొనసాగించాలని మాధవ్ పిలుపు నిచ్చారు.
ప్రధాన మంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాలను విద్యా సంస్థల్లో నిర్వహించే పరిస్థితి రావాలన్నారు.118 మన్ కీ బాత్ కార్యక్రమాల్లో 40 పర్యాయాలు ఆంధ్రప్రదేశ్ అంశాలను ప్రధానమంత్రి ప్రస్తావించారని, అందువల్ల ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ప్రజల మాధ్యమంగా ఆ రోజు కార్యక్రమం నిర్వహించాలన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్రమోదీని కలిసిన సమయంలో పలు సూచనలు చేశారు… 1996-98 ప్రాంతంలో కర్నాటక, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ లలో ఒకే రకమైన బలం ఉండేదని ఒక ప్రభావంతమైన పార్టీగా ఎదిగిన విషయం ప్రధానమంత్రి ప్రస్తావించిన విషయాన్ని మాధవ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. గుజరాత్, కర్నాటక తరహాలో ఇక్కడ కూడా మనం బలపడాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా వివరించారు.
ట్రంప్ టాక్స్ ల ప్రభావం నుండి కొత్తమార్కెట్ లను అన్వేషించడం తో పాటు స్వదేశీ ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లాలన్నారు. ఇక్కడ ఉత్పత్తులు ఇక్కడ కొనుగోలు పెంచాల్సిన అవసరం ఉందని ఆదిశగా చేనేత ఉత్పత్తులు కొనుగోలుచేయాలన్నారు. అక్టోబర్ 2వ తేదీ గాంధీజయంతి కార్యక్రమం స్వదేశీ వస్తు బండాగార్ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.
పార్టీ నూతన పాలకవర్గం ఏర్పడిన తరువాత డినోటిఫైడ్ ట్రైబ్స్ సభ తొలి కార్యక్రమంగా చెబుతూ సంచార జాతులు సదాచార వారసులు.. సంస్కృతికి వారధులు… వారీ అభివృద్ధి కోసం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అనేక కార్యక్రమాలు తీసుకున్నారు… వారి అభ్యున్నతికి మనం పాటు పడాలన్నారు. స్పూర్తి పేరుతో భారీ కార్యక్రమం నిర్వహించ బోతున్నామని మాధవ్ తెలిపారు. ఇదిలావుండగా, జాతీయ సహా సంఘటనా ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్ కి నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని మాధవ్ పరిచయం చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్య కుమార్ యాదవ్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే లు సి.ఆదినారాయణ రెడ్డి, డాక్టర్ పార్థసారథి, ఎన్.ఈశ్వర రావు, తదితరులు వేదికను లంకరించారు. వర్క్ షాప్ నిర్వహణ పర్యవేక్షణ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి చేపట్టారు.