– లక్షా 9 వేల కోట్ల ఖర్చు దుష్ప్రచారమే
మొన్నటి దాక భ్రమరావతి, గ్రాఫిక్స్, అక్కడ ఏమి లేవు అని చెప్పిన్న జగన్ ప్రభుత్వం, ఇప్పుడు కొత్తగా మరో ప్రచారం మొదలు పెట్టింది. అదే “అమరావతికి లక్షా 9 వేల కోట్లు ఖర్చు అవుతుంది. రాష్ట్రం అంత భరించ లేదు” అనే తప్పుడు ప్రచారం.
అమరావతి ఫైనాన్షియల్ ప్లాన్ గురించి, చంద్రబాబు ప్రభుత్వంలో ఉండగా, ఫిభ్రవరి 2019లో, జీవో 50 విడుదల చేశారు.
అందులో అమరావతి మొత్తం ఖర్చు – 55,343 కోట్లుగా చెప్పారు
ఇందులో 3,656 కోట్లు, వివిధ రూపాల్లో తెచ్చుకున్న లోన్లకు, వడ్డీతో సహా అయ్యే ఖర్చు ఇది. అంటే అసలు ఖర్చు 51, 687కోట్లు మాత్రమే
ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, 8 ఏళ్ళలో పెట్టే ఖర్చు కేవలం, 6629 కోట్లు
సీఆర్డీఏ అప్పుగా, మరో 5971 కోట్లు ఇస్తుంది.
వివిధ బ్యాంక్ల నుంచి వచ్చే లోన్లు 37,112 కోట్లుగా అంచనా వేశారు
ఇక ప్రభుత్వానికి అమరావతిలో మిగిలిన భూమి ద్వారా ఎంత లాభం, ఎంత ఆదాయం ఇక్కడ నుంచి వస్తుంది, లాంటి సమగ్ర వివరాలు కూడా ఉన్నాయి.
ఇంత స్పష్టంగా, అమరావతి ప్రాజెక్ట్ మొత్తం 51, 687కోట్లు మాత్రమే అని జీవోలో ఉంటే, లక్షా 9 వేల కోట్లు అని తప్పుదోవ పట్టిస్తున్నారు.
ఇక రెండోది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, 8 ఏళ్ళలో ఖర్చు పెట్టేది కేవలం, 6629 కోట్లు మాత్రమే. అమరావతి నిర్మాణానికి, లక్షా 9 వేల కోట్లు ఖర్చు అవుతుంది అంటూ, వైసీపీ చేస్తున్న విష ప్రచారం మాత్రమే.
– సందీప్