Suryaa.co.in

Andhra Pradesh

సాగు నీటి సరఫరా లో ప్రభుత్వం విఫలం

-మాజీ శాసనసభ్యులు ఆరోపణ

మచిలీపట్టణం: కృష్ణా డెల్టా ప్రాంతంలో సాగునీటిని సరఫరా చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మాజీ శాసనసభ్యులు బూరగడ్డ వేదవ్యాస్ ఆరోపించారు. పొలాలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సాగునీటి కాలువల నిర్వహణలో కూడా ప్రభుత్వం విఫలమైందన్నారు. ఉన్న వనరులను కూడా సద్వినియోగం చేసుకోలేని విధంగా ప్రభుత్వ వ్యవహారం తయారైందని విమర్శించారు.

ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. తీర ప్రాంతంలో నీటి ఎద్దడి మరియు దారుణంగా ఉందని వివరించారు. రెండవ పంట దాల్వా ఇవ్వలేకపోతున్న ప్రభుత్వం కనీసం ఒక్క పంటకు కూడా సరైన రీతిలో నీరు అందించలేకపోవడం విచారకరమన్నారు. ఈ విషయంలో అధికారులతో సమీక్షించిన పరిస్థితి. కూడా ఉండటం లేదన్నారు. సాగునీటి సరఫరా విషయంలో ప్రజా ప్రతినిధులకు కూడా సరైన అవగాహన లేకపోవడం విచారకరమన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే రైతాంగం ఆగ్రహానికి ప్రభుత్వం గురికావాల్సి వస్తుందనివేదవ్యాస్ హెచ్చరించారు.

LEAVE A RESPONSE