మానవ హక్కుల కమీషన్ కు కనీసం ఒక స్టెనోగ్రాఫర్, టైపిస్ట్ ను గానీ ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం
రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ దుస్థితిపై ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాసిన తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొన్ని ప్రభుత్వ సంస్థల దుస్థితి హృదయ విదారకంగా ఉంది.వైసీపీ ప్రభుత్వం బాకా ఊదుకుంటూ ప్రచారం చేసుకోవడం తప్ప చర్యలు శూన్యం.కర్నూలులో ఏర్పాటు చేసిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ఎస్హెచ్ఆర్సి) దుస్థితి ఇందుకు మంచి ఉదాహరణ.
రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ కు కనీసం ఒక స్టెనోగ్రాఫర్ ను గానీ, టైపిస్ట్ ను గానీ ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉండటం దౌర్భాగ్యం. కమీషన్ ఆదేశాలు జారీ చేసేందుకు టైపిస్టు లేకపోవడంతో చైర్పర్సనే స్వయంగా టైప్ చేసుకోవడం ప్రభుత్వ సంస్థల దయనీయ స్థితికి అద్దంపడుతోంది.
ఇదే విషయాన్ని జతచేసిన ఉత్తర్వులలో గౌరవనీయ ఛైర్పర్సన్ సీతారామ మూర్తి పేర్కొన్నారు.ముఖ్యమంత్రి మాత్రం ప్రజల సొమ్ముతో ఆడంబరంగా ప్రచారం చేసుకుంటున్నారు.కనీసం ఇకనైనా రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ కు అవసరమైన సిబ్బందిని, మౌళిక సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మానవ హక్కుల కమీషన్ లక్ష్యాలను సాధించడానికి సక్రమంగా పనిచేయడానికి వీలు కల్పించండి.