రిటర్నబుల్ ప్లాట్లకు పూర్తి హక్కు (Full Freehold Title) ఇవ్వడం. అన్ని పరిమితులను తొలగించి రైతులకు పూర్తి హక్కులు ఇవ్వాలి. గ్రామ పరిమితులు & ప్లాట్ లేఅవుట్ వివాదాల పరిష్కారం సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలి.” రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి. అమరావతి ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, రోడ్లు, డ్రైనేజీ, నీటి లైన్లు, విద్యుత్ మొదలైనవి వేగంగా పూర్తి చేయాలి. బ్యాంక్లు లోన్లు ఇవ్వడానికి ప్రభుత్వ అనుమతి, రిటర్న్ ప్లాట్లపై లోన్లు పొందేలా అధికారిక G.O. ఇవ్వాలి.
రైతుల సమస్యల పరిష్కారం, compensation / settlement పథకాలు స్పష్టంగా తెలియ చెయ్యాలి. రైతు వారి పొలం ఇచ్చిన గ్రామంలోనే ప్లాట్లు ఇవ్వడం, అదే గ్రామం నుండి రిటర్న్ ప్లాట్లు ఇవ్వడం న్యాయసమ్మతం. రోడ్డు వెడల్పుల సమస్యలకు పరిష్కారం చేసి తగిన సరైన పరిహారం ఇవ్వాలి. నెలకు ఒకసారి Grievance మీటింగ్స్, APCRDA monthly meeting నిర్వహించి వెంటనే నిర్ణయాలు చెయ్యాలి. అమరావతి అభివృద్ధికి master plan విడుదల. 5–6 సంవత్సరాల స్పష్టమైన అభివృద్ధి ప్రణాళిక విడుదల చేయాలి.
– రవీంద్ర తీగల