Suryaa.co.in

Andhra Pradesh

రూ.1 ఖర్చు లేకుండా ప్రజలకు వైద్యం అందిచటమే ప్రభుత్వ లక్ష్యం

– జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష‌.. ఆరోగ్యశ్రీ పథకం బ్రోచ‌ర్ విడుద‌ల‌
– సెప్టెంబర్ 30 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష..

తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై సీఎం జగన్ వర్చువల్ గా స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సందర్భంగా డాక్టర్ వైయ‌స్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం పొందడం ఎలా? అనే అంశంపై ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ రూపొందించిన బ్రోచర్ ను సీఎం జ‌గ‌న్ విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి విడ‌ద‌ల ర‌జిని, ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

జగనన్న సురక్ష తరహాలోనే ఈ ఆరోగ్య సురక్షని కూడా చేపట్టాలని సీఎం పిలుపునిచ్చారు. సురక్ష తరహాలో ప్రతి ఇంటికి వెళ్లి, వారి సమస్యలను తెలుసుకోవాలని, ప్రతి గ్రామంలో ఒక నిర్ణీత రోజున గ్రామ ప్రజలకు మంచి జరిగేలా హెల్త్ క్యాంపు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. సురక్ష ద్వారా ప్రతి ఇంట్లో జల్లెడ పట్టి, ఆరోగ్య సమస్యలను తెలుసుకోవాలని అధికాలకు సీఎం తెలిపారు. వాటికి పరిష్కారమిచ్చే గొప్ప బాధ్యతను మనం తీసుకుంటున్నామని సీఎం పేర్కొన్నారు.

మనం నిర్వహించే గ్రామ శిబిరాల్లో స్థానికలుకు అవసరమైన పరీక్షలు చేసి, మందులు, కళ్లద్దాలు ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటున్నామని సీఎం అన్నారు. “ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలో ప్రతి ఇళ్లు కవర్ కావాలి. క్రానిక్ పేషెంట్ల ఉన్న ఇళ్లను మరింత ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని పనిచేయడంతో పాటు వారిని చేయిపట్టుకుని నడిపించాలి. అలా జల్లెడ పట్టిన గ్రామంలోని సమస్యలను తెలుసుకుని ఫ్యామిలీ డాక్టర్ విలేజ్ క్లినిక్ ద్వారా వాటిని పరిష్కరించాలి. ఒకవైపు తనిఖీలు చేస్తూనే మందులు కూడా ఇస్తాం. ఇది చాలా పెద్ద మార్పు. దీనికి సంబంధించిన బాధ్యత మీరు తీసుకోవాలి” అని సీఎం చెప్పారు.

ఈ కార్యక్రమంలో గర్భవతులు, బాలింతలు, రక్తహీన, దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడే వారిని గుర్తించి వారికి తగిన చికిత్స చేయాలని సీఎం సూచించారు. సెప్టెంబర్ 30న ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని, రూ.1 ఖర్చు లేకుండా ప్రజలు వైద్యం అందించటమే లక్ష్యమని సీఎం పేర్కొన్నారు.

LEAVE A RESPONSE