-ప్రభుత్వ విప్ కాపురామచంద్రారెడ్డి అనుచరుడు వసంత్ కు, అంతరాష్ట్ర అక్రమ ఆయుధాల ముఠాలతో ఉన్న సంబంధమేంటి?
– ప్రభుత్వ విప్ కాపురామచంద్రారెడ్డి ఒత్తిడితోనే పోలీసులు ఆయన అనుచరుడు వసంత్ పేరుని అక్రమఆయుధాల కేసునుంచి తప్పించారా?
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు
ప్రజలకు సేవచేయాల్సిన అధికారపార్టీనేతలు, అక్రమార్జనే ధ్యేయంగా హద్దులమీరి ప్రవర్తిస్తూ, అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారని, అంతరాష్ట్ర అక్రమఆయుధాల ముఠాలతో అనంత పురం వైసీపీనేతలకు సంబంధాలున్నాయన్న వార్తలు, జిల్లావాసుల్నేగాక యావత్ రాష్ట్రా న్నే దిగ్భ్రాంతికి గురిచేశాయని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు . ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
“అధికారపార్టీనేతలు డబ్బుసంపాదనకోసం రాష్ట్రాలహద్దులు దాటి హద్దుమీరి ప్రవర్తిస్తు న్నారు. నేరాలుఘోరాలతో విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారు.మారణాయుధాల ముఠాలతో వైసీపీనేతలకు సంబంధాలున్నట్టు తెలుస్తోంది. డీజీపీనే స్వయంగా అనంతపురం పోలీసులు అంతరాష్ట్ర మారణాయుధాల ముఠాను పట్టుకున్నారని, పెద్దఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. అదే కేసుగురించి కల్యాణదుర్గం డీఎస్సీ మాట్లాడుతూ, ఇప్పటి వరకు సాగిన వారిదర్యాప్తులో మారణాయుధాల వ్యవహారంలో రాజకీయనేతల ప్రమేయం ఉన్నట్లు తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు.
దొంగనోట్ల కేసులో అరెస్ట్ అయిన వసంత్ ద్వారా అక్రమ ఆయుధాల ముఠా వ్యవహారం తెలుసుకున్న పోలీసులు, ఆ ముఠాకు సంబంధించిన వ్యవహారం గుట్టుమట్లను చేధించి, అసలు దోషుల్ని ప్రజలముందు ఉంచరా?
అనంతపురం జిల్లా సరిహద్దు కేంద్రమైన డీ.హారేహళ్ లో వైసీపీకార్యకర్త వసంత్ ను దొంగనోట్లకేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. అదేకేసులో పట్టుబడిన రియాజ్, వసంత్ ల ద్వా రా, దేశవ్యాప్తంగా అక్రమఆయుధాల సరఫరా, మాదకద్రవ్యాలు, గంజాయి అమ్మకం, తదితర అక్రమదందాలు నడిపే గ్యాంగ్ ల కార్యకలాపాలు బయటకు వచ్చాయి. వసంత్ వద్ద మొదలైన పోలీస్ విచారణ రియాజ్ వరకువెళ్లి, అక్కడినుంచి మధ్యప్రదేశ్, గోవా, కర్ణాటక రాష్ట్రాల్లోని ఆరుగురు అంతరాష్ట్రముఠాసభ్యుల్ని అదుపులోకి తీసుకునేవరకు వెళ్లింది.
ఈ వ్యవహారాలకు సంబంధించి బళ్లారికేంద్రంగా కార్యకలాపాలు నడిపే రియాజ్ కు, దొంగనోట్ల వ్యవహారంలో వసంత్ పరిచయమయ్యాడు. రియాజ్ వెనుక కర్ణాటకు చెందిన కొందరు రాజకీయనేతలు ఉన్నట్టు తెలుస్తోంది. అక్రమ ఆయుధాలముఠాను రాయదుర్గం కోర్టులో హాజరుపరిచే సమయంలో పోలీసులు మీడియాకు ఎందుకు చెప్పలేదు? పోలీసులు మీడియాను అనుమతించకపోవడం పలుఅనుమానాలకు తావిస్తోంది. దొంగనోట్ల చెలామణిలో పట్టుబడిన వసంత్ వైసీపీ కార్యకర్త. వసంత్ గతంలో స్థానికంగా నిర్వహించిన వైసీపీ శిక్షణాశిబిరంలో పాల్గొన్నాడు. ప్రభుత్వ విప్, రాయదర్గం ఎమ్మెల్యే కాపు రామచం ద్రారెడ్డికి వసంత్ అనుంగు అనుచరుడు. ఈ నేపథ్యంలో పోలీసులు వసంత్ ని మరింత లోతుగా విచారిస్తే కళ్లుచెదిరే వాస్తవాలు బయటకువస్తాయి.
ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి తనవద్ద ఉన్న గన్ మెన్లను తిరస్కరించాడని, వారంపాటు వారిని తనవద్దకు రానివ్వలేదని, పోలీసులపై ఆయన అలిగాడని మీడియాలో ఇదివరకు కథనాలు వచ్చాయి. ఆ కథనాల్ని కాపురామచంద్రారెడ్డి కూడా ఖండించలేదు. అసలు రామచంద్రారెడ్డి అలా ఎందుకు చేశాడో పోలీసులు చెప్పాలి.
కాపురామచంద్రారెడ్డి ఒత్తిడితోనే వసంత్ పేరుని పోలీసులు అక్రమ ఆయుధాల కేసునుంచి తప్పించారా?
దొంగనోట్ల కేసులో అరెస్ట్ అయిన వసంత్ ని విచారిస్తున్నప్పుడే అక్రమ ఆయుధాల వ్యవహా రం బయటకువచ్చింది. కానీ అక్రమ ఆయుధాలకేసులో వసంత్ ను పోలీసులు ఎందుకు ముద్దాయిగా చూపలేదు. కాపురామచంద్రారెడ్డి ఒత్తిడితోనే పోలీసులు వసంత్ పేరుని అక్రమ ఆయుధాల కేసునుంచి తప్పించారనే అనుమానం కలుగుతోంది. పోలీసులు రాజకీయకోణంలో కాకుండా ఈ కేసులో పారదర్శకంగా వ్యవహరించాలి. అక్రమ ఆయుధాల కేసు పోలీసులకు తెలిసినప్పుడు, వసంత్ ద్వారా నిజాలు బహిర్గతమైనప్పుడు, సదరు వసంత్ కాపురామచంద్రారెడ్డికి అనుంగు అనుచరుడు అయినప్పుడు పోలీసులు ఆ దిశగా ఎందుకు దర్యాప్తుజరపరు?
వసంత్ కి, రామచంద్రారెడ్డికి మధ్య ఉన్న సంబంధాలను పోలీసులు ఎందుకు బయటపెట్టడంలేదు? పోలీసులు అక్రమ ఆయుధాలకేసు వివరాలు తెలియచేసిన వసంత్ ని వదిలేసి, సదరు కేసు దర్యాప్తు చేయడంలోని ఆంతర్యం ఏమిటి? మాకున్న అనుమానాలు నివృత్తిచేయడంతో పాటు, కేసు విచారణ నిష్పక్షపాతంగా జరిపి, అసలైన దోషుల్ని ప్రజలముందు ఉంచాలని పోలీసుల్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటివరకు కాపురామచంద్రారెడ్డి అక్రమ ఇసుకరవాణా, అక్రమమద్యం అమ్మకాల్లోనే ఉన్నాడను కుంటున్నాం.
ఆయన అనుచరుడు వసంత్ కు, అక్రమఆయుధాల ముఠాతో సంబంధాలు ఉన్నాయని తెలిశాక, సదరుముఠాలతో రామచంద్రారెడ్డికి కూడా సంబంధం ఉండొచ్చనే అనుమానం అనంతపురంజిల్లా ప్రజలకు కలుగుతోంది. అధికారం చేతిలో ఉంటే వైసీపీవారు ఎంతకైనా తెగిస్తారనే సీమవాసుల అనుమానాలను తొలగించాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉంది” అని శ్రీనివాసులు స్పష్టంచేశారు.