హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. కేసులోని మెరిట్స్ ఆధారంగా నరేందర్ రెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను పరిశీలించాలంటూ కింది కోర్టుకు సూచించింది. ఈమేరకు తీర్పు వెలువరించింది.
లగచర్లలో ప్రభుత్వ అధికారులపై రైతుల దాడి కుట్రలో నరేందర్ రెడ్డి హస్తం ఉందనే ఆరోపణలతో ఆయనను అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్ పై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, లగచర్ల దాడి ఘటనకు సంబంధించి తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఆయన మరోమారు హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ పిటిషన్ ను పరిశీలించిన కోర్టు, కేసు కొట్టేయలేమంటూ పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్ ను తోసిపుచ్చింది. ఈమేరకు తీర్పు వెలువరించింది.