– దొంతిరెడ్డి వేమారెడ్డి
గుంటూరు : మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో వైయస్సార్ 16వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి, ఘన నివాళులర్పించారు. నియోజవర్గ ఇన్ఛార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి గ్రామంలోని ప్రజలకు అన్నదానం చేశారు. అనంతరం వేమారెడ్డి మాట్లాడుతూ…
రాష్ట్రానికి, రైతులకు ఎన్నో సేవలందించిన గొప్ప మహనీయుడు వైఎస్ రాజశేఖరరెడ్డి అని కొనియాడారు. ఆరోగ్యశ్రీ పథకం, ఉచిత ఇండ్లు పంపిణీ, ఉచిత కరెంట్, రైతు రుణమాఫీ ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజల కోసం ప్రవేశపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ అధ్యక్షుడు పృథ్వీరాజ్, మైనార్టీ నియోజవర్గ అధ్యక్షుడు జానీ భాష, జడ్పిటిసి దాసర అరుణా, సుధాకర్, భాస్కర్, యువరాజు, బుల్లిబాబు, తిరుమలరావు, జాన్ బాషా, జానీ, తదితరులు పాల్గొన్నారు.