Suryaa.co.in

Andhra Pradesh

గర్భిణిపై అత్యాచార ఘటన ఏపీలో శాంతిభద్రతలకు నిదర్శనం

– రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్

రేపల్లె రైల్వే స్టేషన్లోన జరిగిన అత్యాచారం అత్యంత బాధకరం దళిత వర్గానికి చెందిన గర్భిణి స్త్రీపై గంజాయి సేవించిన ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. రేపల్లె ప్రాంతంలో సైతం గంజాయి విచ్చలవిడిగా లభిస్తోంది.

నిన్న డిప్లమో చదివే విద్యార్థినిని ప్రతిభ ట్యూటోరియల్స్ వారు వేధిస్తున్నారని ఫిర్యాదు చేసిన 24 గంటలు గడవక ముందే, మరో అత్యాచారం జరగడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం రేపల్లెలో ఇలాంటి ఘటనలు వైసీపీ ప్రభుత్వం ఏర్పాడ్డాకే విచ్చలవిడిగా జరుగుతున్నాయి.

రాష్ట్రంలో ప్రతి రోజు మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇలాంటి ఘటనలకు కారకులైన వారిపై ప్రభుత్వం కఠింనంగా వ్యవహరించాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునేంత వరకు మేం పోరాటం చేస్తాం.

రేపల్లెలో 23 వారాల దళిత గర్భిణీ స్త్రీపై జరిగిన అత్యాచారానికి నిరసననా రోడ్డెక్కిన టీడీపీ కార్యకర్తలు, నాయకులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం దుర్మార్గం.

రాష్ట్రాన్ని డ్రగ్స్, గంజాయి, పేకాట హబ్లులగా మార్చి.. న్యాయం కోరిన బాధితులపై లాఠీచార్జ్ చేయడం వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనం.మొన్న దుగ్గిరాలలో నారా లోకేష్ పై రాళ్లదాడి, నేడు రేపల్లెలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై లాఠీచార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.

పేద మహిళలకు న్యాయం జరిగేంతవరకు టీడీపీ పోరాడుతుంది. అత్యాచార, హత్యాయత్నాలకు పాల్పడుతున్న మూర్ఖులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకునేంత వరకు రేపల్లెలో ప్రతి టీడీపీ కార్యకర్తతో కలిసి రోడ్డెక్కి పోరాటం చేస్తాం.

LEAVE A RESPONSE