– ఐ ప్యాక్ ఆదేశాలతోనే జగన్మోహన్ రెడ్డి టీడీపీ సానుభూతిపరులు, నేతలు, కార్యకర్తల ఓట్లను తొలగించి, దొంగఓట్లు సృష్టిస్తున్నారు. : విజయ్ కుమార్
• వాలంటీర్ల ద్వారా సేకరించిన ప్రజల సమాచారం ఎక్కడుందో, దానిపై యాక్సిస్ఎవరెవరికి ఇచ్చారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి
• జగన్మోహన్ రెడ్డి, అతనిపార్టీకోసం పనిచేస్తున్న ఐప్యాక్ సంస్థకు, ప్రజల సమాచారానికి ఉన్న కనెక్షన్ ఏమిటి?
• రాష్ట్రప్రజల సమాచారం మొత్తం ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టిన జగన్ ప్రభుత్వం, భవిష్యత్ లో సమాచార దుర్వినియోగం జరిగితే బాధ్యత వహిస్తుందా?
– యువగళం పాదయాత్ర ప్రదేశంలో (ఉదయగిరి) టీడీపీ అధికారప్రతినిధులు నీలాయపాలెం విజయ్ కుమార్, ఆనం వెంకట రమణారెడ్డి
“ నాలుగేళ్ల నుంచి వాలంటీర్లు సేకరిస్తున్న ప్రజల సమాచారం మొత్తం హైదరాబా ద్ కు చేరిందని, వైసీపీనేతలు, వాలంటీర్లు సంక్షేమం పేరుతో ప్రజలనుంచి సేకరిం చిన వారి వ్యక్తిగత వివరాలు మొత్తం ఏమయ్యాయో, ఎక్కడ దాచారో చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు గతంలోకూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వాలంటీర్లు సేకరించిన సమాచారం ప్రైవేట్ వ్యక్తులు, కంపెనీల వద్ద ఉందా..ఉంటే దానికి ఎవరెవరికి యాక్సిస్ ఉందనే వివరాలపై కూడా వైసీపీప్రభుత్వం స్పందించలేదు.
2020లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో.ఆర్.టీ-16ను విడుదలచేసింది. వాలంటీర్ వ్యవస్థ ప్రారంభించిన దాదాపు 10నెలల తర్వాత ఈ జీవో ఇచ్చారు. సదరు జీవోలో మూడుకంపెనీలు కన్సార్టియంగా ఏర్పడి, వాలంటీర్లను ఆర్గనైజ్ చేశారని, వారికి ట్రైనింగ్ ఇస్తారని, వారిని మేనేజ్ చేస్తారని, కోఆర్డినేషన్, మాని టరింగ్ కూడా చేస్తారని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. వాలంటీర్లు సేకరించిన వివ రాల్ని భద్రపరిచే పోర్టల్ నిర్వహణను కూడా ప్రభుత్వం ఆ మూడుకంపెనీలకే ఇచ్చింది.
వాలంటీర్లు ఏ సమాచారం సేకరిస్తారో, ఆవివరాల్నీ ఆ మూడుకంపెనీల వద్ద ఉన్నాయి. రామ్ ఇన్ఫో, ఉపాధి టెక్నోసర్వీసెస్, మ్యాక్స్ డిటెక్టివ్ అండ్ గార్డి యన్ సర్వీసెస్ అనే మూడుకంపెనీలు కన్సార్టియంగా ఏర్పడి వాలంటర్లు సేకరిం చిన సమాచారాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్నాయి. ఈ మూడుకంపెనీలను కలిపే ఎఫ్.ఓ.ఏ (ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ) అంటున్నారు.
రాష్ట్రప్రజల సమాచారం మొత్తం ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టిన జగన్ ప్రభుత్వం, భవిష్యత్ లో సమాచార దుర్వినియోగం జరిగితే బాధ్యత వహిస్తుందా?
ఈ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ గ్రామాలు, మండలాలు, జిల్లాలవారీగా పనిచేస్తోంది. గ్రామ, వార్డు వాలంటీర్లు నిత్యం క్షేత్రస్థాయిలో చేసే ప్రతిపనిని కోఆర్డినేట్, మేనేజ్, మానిటర్ చేయడం. వాలంటీర్లు సేకరించే సమాచారం మొత్తం వారినుంచి సేకరిం చడం. జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్వవస్థను ఏర్పాటుచేసినప్పటినుంచి వారు ప్రజలకు సంబంధించి సేకరిస్తున్న వివరాలు మొత్తం ఎఫ్.ఓ.ఏ ఏజెన్సీ వద్దే ఉన్నాయి.
ఏపీప్రజల సమాచారం హైదరాబాద్ లో ఉండటం వల్ల జరిగే అనర్థాలు ఏమిటో ప్రజలే ఆలోచించాలి. ఈ సమాచారం వైసీపీప్రభుత్వం వద్దకూడా ఉంది. ప్రజలసమాచారాన్ని సేకరించి, వారివ్యక్తిగత వివరాలతోసహా ప్రైవేట్ సంస్థలకు అప్పగించిన జగన్మోహన్ రెడ్డి, అతనిప్రభుత్వం అది దుర్వినియోగమైతే బాధ్యత తీసుకుంటుందా? ముఖ్యమంత్రి ఇటీవల ప్రారంభించిన జగనన్న సురక్ష పథకాన్ని వాలంటీర్లు మానిటర్ చేస్తారని చెప్పారు. జగన్ పెంచిపోషిస్తున్న ఐపాక్ సంస్థేమో జగనన్న సురక్షపథకంలో ప్రజలకు అవసరమైన అన్నిరకాల సర్టిఫి కెట్లు తాము అందిస్తామని చెబుతోంది.
ప్రజలకు సర్టిఫికెట్లు ఇచ్చేఅధికారం ఆసంస్థకు ఎవరిచ్చారు? అసలు ఐప్యాక్ సంస్థకు ప్రభుత్వానికి ఏమిటి సంబం ధం? జగన్మోహన్ రెడ్డి తనపార్టీకోసం ఏర్పాటుచేసిన ఐప్యాక్ సంస్థకు, ప్రజల సమాచారానికి ఉన్న సంబంధం ఏమిటి? రామ్ ఇన్ఫో, ఉపాధి టెక్నోసర్వీసెస్, మ్యాక్స్ డిటెక్టివ్ అండ్ గార్డి యన్ సర్వీసెస్ సంస్థలతోపాటు, యూనికార్న్ కన్సల్టింగ్స్ సంస్థలకు ప్రజల సమాచారంపై పూర్తి యాక్సిస్ ఉంది. ఆయా సంస్థ లు ఏపీప్రజల సమాచారాన్ని దుర్వినియోగంచేసినా, సంఘవిద్రోహ సంస్థలకు అప్పగించినా చేయగలిగింది ఏమీలేదు.
వాలంటీర్ల ద్వారా సేకరించిన సమాచారంతోనే ఐప్యాక్ సంస్థ ఆలోచనల ప్రకారం వైసీపీప్రభుత్వం టీడీపీ సానుభూతిపరులు, కార్యకర్తల ఓట్లు తొలగిస్తోంది
వాలంటీర్లు సేకరించిన ప్రజల వివరాల్ని కులం, మతం, పార్టీల పరంగా విభజించి, టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఓట్లు తొలగిస్తే ఊరుకోమని ప్రతిఘటించేవారి ఓట్లను వారినివాసాలకు దూరంగా ఉండే పోలింగ్ కేంద్రాలకు బదలాయిస్తున్నారు. డమ్మీ డోర్ నెంబర్లతో దొంగఓట్లు సృష్టిం చడం, అర్హుల ఓట్లు తొలగించడం, అంతా వైసీపీప్రభుత్వానికి మేలుచేయడంకోసం ఐప్యాక్ సంస్థ చేస్తున్నదే. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉండే వారిఓట్లు తొలగించి, వచ్చేఎన్నికల్లో గెలవాలన్నదే వైసీపీ ప్రభుత్వ వ్యూహం.
గతంలో అమెరికాలో జరిగిన ఎన్నికల్లో కేంబ్రిడ్జ్ అనలిటికా అనేసంస్థ అక్కడిప్రజల ఓట్లు తొలగించి, గెలుపోటములను ప్రభావితంచేసింది. వాలంటీర్ వ్యవస్థద్వారా ఎఫ్.ఓ.ఏ కన్సార్టియంగా ఏర్పడి, ప్రజల సమాచారాన్ని ఐప్యాక్ సంస్థకు అందించి, మొత్తంగా ఒకనెట్ వర్క్ గా ఏ ర్పడి ఓట్లతొలగింపుకు శ్రీకారంచుట్టారు. వాలంటీర్ వ్యవస్థకు తామువ్యతిరేకం కాదు.. కానీ వారు సేకరిం చే సమాచారం పక్కదారిపడుతుందని తెలిసీ , ప్రభుత్వం చెప్పిందల్లా చేయ డాన్నే తప్పుపడుతున్నాం.
రాష్ట్రప్రజల పూర్తిసమాచారం తస్కరించిన వైసీపీప్రభుత్వం, దాన్ని ఎక్కడదాచి, ఏంచేస్తుందో కేంద్రప్రభుత్వం నిగ్గుతేల్చాలి : ఆనం వెంకట రమణారెడ్డి
“వాలంటీర్లు, గృహసారథులు, వైసీపీనేతలుసేకరించే సమాచారం మొత్తం మూడు కంపెనీలు కన్సార్టియంగా ఏర్పడి మానిటర్ చేస్తున్నాయి. వాటిలో రామ్ ఇన్ఫో అనేసంస్థ కేవలం పైకి కనిపించేదే. దానివెనకున్న రెండుకంపెనీలు జగన్మోహన్ రెడ్డికి బాగా తెలిసినవారివే. ఉపాధి టెక్నోసర్వీసెస్ అనేకంపెనీ నారాయణ చెన్న కృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, నారాయణ కల్యాణ్ చంద్రాధర్ రెడ్డిలు నిర్వహిస్తున్నా రు. మ్యాక్స్ డిటెక్టిట్ సర్వీసెస్ అనే మరోకంపెనీలో ఫిబ్రవరి 01, 2022న మేనేజిం గ్ డైరెక్టర్, డైరెక్టర్లు ఒకేసారి అందరూమారిపోయారు.
ఈ మూడుకంపెనీలు కలిసి ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీగా (ఎఫ్.ఓ.ఏ) ఏర్పడటం వెనకున్న రహస్యంఏమిటి?
వాలంటీర్లు ప్రజలనుంచి సేకరించిన సమాచారం ప్రభుత్వం వద్ద ఉందా..లేక ఎఫ్.ఓ.ఏ వద్ద ఉందా? యూనికార్న్ కన్సల్టింగ్ అనే కంపెనీ హైదరాబాద్ లో ఉం ది. దానిచిరునామా, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అదానీ డిస్టిలరీస్ సంస్థ అడ్రస్ ఒకటే. ఆ చిరునామా… డోర్ నెం : 2627-7-66-2, ప్రశాంతి హిల్స్, కాజా గూడ, హైదరాబాద్. వాలంటీర్లు సేకరించిన ఏపీప్రజల సమాచారం మొత్తం యూనికార్న్ సంస్థవద్దే ఉంది.
రామ్ ఇన్ఫో సంస్థ గతంలో రాష్ట్రంలోని 90.45 లక్షల ఇళ్లకు సంబంధించిన సమాచారం తమవద్ద ఉందనిచెప్పింది. వాలంటీర్లను మానిటర్ చేయడానికి క్షేత్రస్థాయిలో 1116 మందిని నియమించా మనికూడా చెప్పారు. రామ్ ఇన్ఫోసంస్థ వద్ద ఉన్న 90లక్షల కుటుంబాల సమాచారం యూనికార్న్ సంస్థకు చేరింది.
వాలంటీర్ క్షేత్రస్థాయిలో సేకరించే సమచారాన్ని చేసే పనుల్ని గృహసారథులకు చెబితే, గృహసారథులు ఆ సమాచారాన్ని ఎఫ్.ఓ.ఏకు అందిస్తున్నాడు. ప్రజల ఆధార్, బ్యాంక్ ఖాతాల వివరాలు, ఓటర్ ఐడి కార్డు సమాచారం మొతం ఎఫ్.ఓ. ఏపరిధిలో ఉంది. వాలంటీర్లను మానిటర్ చేస్తూ, కోఆర్డినేట్ చేస్తున్న మూడుకం పెనీలకు ఏపీ ప్రజల సమాచారం మొత్తం తెలుసు. ఆ సమాచారం ఐప్యాక్ కు కూ డా అందింది. వైసీ పీప్రభుత్వం జాతకంతో పాటు, ప్రజల సమాచారం మొత్తం ఐప్యాక్ కంట్రోల్లోనే ఉంది.
ప్రజల ఆధార్, ఓటర్, పాన్, బ్యాంక్ అకౌంట్ వివరాలు.. ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్ వంటి సామాజిక ఖాతాల వివరాలు ప్రభుత్వానికి ఎందుకు? ఏపీ ప్రజల అభిరుచులు, ఆలవాట్లు సహా వారి పూర్తిసమాచారం మొత్తం 360 డిగ్రీస్ ప్రొఫైలింగ్ చేయబడింది.
జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్లుగా ప్రజల్ని వేధిస్తూ, అవినీతిచేస్తూ, ఎలాంటి అభివృ ద్ధి చేయకపోయినా కూడా ఏ ధైర్యంతో వైనాట్ 175 అంటున్నాడో ప్రజలు ఆలో చించాలి. 360 డిగ్రీస్ ఫ్రొఫైలింగ్ అనే మాటవినే ఉంటారు. ఒకఊరిలో ఉండే కు టుంబాల్ని, మొత్తంగా ఆ ఊరినే ప్రొఫైల్ చేయడం. ప్రతిఇల్లు, ఆఇంట్లోని వారి మొ త్తం వివరాలు, వారి అలవాట్లతోసహా, సేకరించే సమాచారమే ప్రొఫైలింగ్. పౌరుల ఆధార్, ఓటర్, పాన్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్, ఫోన్ డీటెయిల్స్ తో పాటు, వారి అలవాట్లు, అభిరుచులు, ఆలోచనల్నికూడా పసిగట్టడమే ప్రొఫెయిలింగ్.
అలానే పౌరుల ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాయాప్ ల సమాచా రం మొత్తం అదుపులో పెట్టుకోవడం. చిత్తూరుజిల్లాలో వైసీపీఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒకసందర్భంలో ఫేస్ బుక్ ఐడీలు ఇవ్వాలని కోరాడు. ప్రజల వాట్సా ప్ గ్రూపుల వివరాలు ఎందుకు సేకరిస్తున్నారు?
వాలంటీర్లను అడ్డుపెట్టుకొని రాష్ట్రప్రజలకు సంబంధించిన 360 డిగ్రీస్ ప్రొఫైలింగ్ సేకరిస్తున్న వైసీపీప్రభుత్వం ఆ వివరాల్ని ఎవరో అనామకులకు కట్టబెట్టడాన్ని ఏమనుకోవాలి? కులం, మతం, వర్గం, ఏ పార్టీ సానుభూతి పరులనే వివరాలు సేక రించడానికి వైసీపీప్రభుత్వమే డబ్బులిచ్చి, ఆ వివరాల్ని ఇతరసంస్థలకు కట్టబెట్ట డం వెనకున్న ఆంతర్యం ఏమిటి? నాలుగేళ్లలో వైసీపీప్రభుత్వం వాలంటీర్లకు దాదాపు రూ.1600కోట్లు ఖర్చుపెట్టి, ప్రజలనుంచి వివరాలుసేకరించింది. ప్రజలు వారి ఓట్లుపోకుండా కాపాడుకోవాలంటే వాలంటీర్లు, గృహసారథులముందు జై జగన్ అని, ఓటుపోకుండా చూసుకుంటే సరిపోతుంది.
ఏపీ పౌరులసమాచారం ఎక్కడుందో, ఎవరిచేతుల్లో ఉందో, దాన్ని ఎవరు తమస్వార్థానికి వాడుకుంటు న్నారనే దానిపై కేంద్రం తక్షణమే దృష్టిపెట్టాలి
దేశంలో ఎక్కడాజరగని విధంగా ఏపీలోనే ప్రజలసమాచారం పక్కదారిపడుతోంది. ఏపీప్రజల వ్యక్తిగత సమాచారం హైదరాబాద్ లోని కంపెనీలవద్ద ఎందుకు ఉంచారు? ప్రజలసమాచారా న్ని క్షుణ్ణంగా పరిశీలించి, వారి వ్యక్తిగత జీవితాలను ప్రభావితంచేసేస్థాయికి ఐ ప్యాక్ విభాగం వెళ్లింది. రాష్ట్రంలో పౌరుల వ్యక్తిగత సమాచార తస్కరణ, దుర్వినియోగంపై తక్షణమే కేంద్రప్రభుత్వం దృష్టి పెట్టాలి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తక్షణమే కన్సార్టియంగా ఏర్పడిన మూడు కంపెనీ లు, వాటివెనకున్నవారి వివరాలు, ఐప్యాక్ సంస్థ కార్యకలాలపై దృష్టి పెట్టాలని కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి, అతనిప్రభుత్వం సేకరించిన సమాచారం సంఘ విద్రోహశక్తులచేతుల్లోకి వెళ్తే, ఎవరుబాధ్యత తీసుకుంటారు? రాష్ట్రానికి, ప్రజలకు ఏదైనా జరగరానిది జరిగితే జగన్ బాధ్యత వహిస్తాడా?”