Suryaa.co.in

Andhra Pradesh

ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే కీలక బాద్యత సమాచార శాఖదే

– మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ
• ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేయండి..

ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాల్సిన కీలక బాధ్యత సమాచార శాఖపై ఉందని,ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా అధికారులందరూ ఇష్టపడి పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సమాచార పౌరసంబంధాల, సినిమాటోగ్రపీ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అన్నారు. మంత్రి, అధికారులు అనికాకుండా.. మనమంతా ఒక కుటుంబంలా అంతా కలిసి పనిచేయాలని, తర్వారా ఐ అండ్ పీఆర్ సమర్థవంతంగా పనిచేస్తుందనే ముఖ్యమంత్రి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నారు. సమాచార శాఖా మంత్రిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం విజయవాడ సమాచార పౌరసంబంధాల శాఖా ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన స్వాగత కార్యక్రమానికి సమాచార శాఖ కమిషనర్ టి. విజయకుమార్ రెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులు, ఉద్యోగులు మంత్రికి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. సమాచార శాఖ నిర్వహిస్తున్న పనితీరును పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా కమిషనర్ మంత్రికి వివరించారు. అనంతరం సమాచార శాఖ రూపొందించిన జగనన్న ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్, నవరత్నాలు-జగనన్న పాలనా రథచక్రాలు బ్రోచర్ ను మంత్రి తిలకించి అధికారులను అభినందించారు.

ఈ సందర్భంగా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ… 20నెలలుగా మంత్రిగా పనిచేస్తున్న బీసీ సంక్షేమ శాఖను కొనసాగిస్తూ అదనంగా ఐ అండ్ పీఆర్, సినిమాటోగ్రఫీ శాఖలను కేటాయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పనిచేస్తానన్నారు. గత పాలకులకు భిన్నంగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వినూత్న ఆలోచనలతో
1 నూతన పధకాలను రూపొందించి అమలు చేస్తుందన్నారు. ప్రతి పేదవాడి ఇంటికి సంక్షేమం చేరేలా ఆర్థికం సాయం అందుతున్నారు. పేదవాడు అప్పులపాలు కాకుండా విద్య, వైద్య రంగాల్లో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం గొప్ప పథకమని, పేదల పాలిట వరమని తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వచ్చే ప్రతికూల వార్తలను ఎప్పటికప్పుడు పరిశీలించి.. వాటికి సంబంధించి ప్రభుత్వ ఉద్దేశ్యాలను ఎప్పటికప్పుడు వార్తాపత్రికలకు అందించాలన్నారు. ఐ అండ్ పీఆర్ శాఖకు మంచి పేరు వచ్చేలా అందరు అధికారులు కృషి చేయాలని సూచించారు. సమాచారశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి ఇచ్చిన బాధ్యతను ఇష్టంగా తీసుకుని పనిచేస్తానని, ది బెస్ట్ అనిపించుకునేలా కృషిచేస్తానని తెలిపారు.

ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి పెద్ద సినీ హీరోలందరూ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లినవారేనని.. సినిమావారంతా విభజిత ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేయడానికి ముందుకు రావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారని.. వాళ్లంతా రాష్ట్రంలో షూటింగ్ లు చేసుకునేలా ప్రయత్నం చేయాలన్నారు. కోనసీమ,
మారేడుమిల్లి, అంతర్వేది, విశాఖ వంటి ప్రాంతాల్లో సినిమా షూటింగ్ లకు అనువైన ప్రదేశాలున్నాయని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ తెలిపారు.

కమిషనర్ టి. విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సమాచార శాఖ ద్వారా గత సంవత్సరంలో 49 ప్రాయోజిత ప్రకటనల(యాడ్స్)ను ఇచ్చామని, గత మూడేళ్లలో ప్రభుత్వానికి 85 కోట్లను ఆదా చేశామని మంత్రికి వివరించారు. సమాచార శాఖ విధులు,బాధ్యతలను వివరిస్తూ మీడియా రిలేషన్స్, మీడియా ఇన్ఫర్మేషన్ మానిటరింగ్ సిస్టమ్ (మిమ్స్), కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్, ఫీల్డ్ పబ్లిసిటీ, నేషనల్ మీడియా కో ఆర్డినేషన్, అడ్వర్టైజ్ మెంట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, సి. రాఘవాచారి ప్రెస్ అకాడమీ, ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ నిర్వహణ, నూతన ఆన్ లైన్ సినిమా టిక్కెట్ ల పాలసీ వివరాలను కూలంకషంగా మంత్రికి వివరించారు. అలాగే అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రిడిటేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చిన్న పత్రికల వారికి ప్రయోజనం కలిగేలా
జీఎస్టీ నిబంధనల్లో కొన్ని సడలింపులు ఇచ్చామని, జర్నలిస్టులకు హెల్త్ కార్డులు అమలు చేస్తున్నామని మంత్రికి కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి వివరించారు.

ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ అడిషనల్ డైరెక్టర్ ఎల్.స్వర్ణలత, జాయింట్ డైరెక్టర్లు పి. కిరణ్ కుమార్, కస్తూరి బాయి తేళ్ల, సీఐఈ ఓ. మధుసూధన్, డీడీ పి.తిమ్మప్ప, ఆర్ఐఈ సీ.వీ. కృష్ణారెడ్డి, ఏ.పి. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ శేషసాయి, అసిస్టెంట్ డైరెక్టర్లు శ్రీరామచంద్రమూర్తి, వెంకట్రాజు గౌడ్, ఎం. భాస్కర నారాయణ,నారాయణ రెడ్డి, పద్మజ, ఇతర ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE