-ఏపీ ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటాను ఇవ్వకపోవడం వల్లే..
-ఖర్చులో 25 శాతం భాగస్వామ్యం చెల్లించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే
తన వాటాగా కేవలం రూ.2.69 కోట్లు మాత్రమే చెల్లించింది
-ఏపీ ప్రభుత్వం తన వాటాగా 354 కోట్లు చెల్లించాల్సి ఉంది
– కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్
ఏపీ తీరు వల్లే కోటిపల్లి-నర్సాపూర్ న్యూలైన్ (57.21 కిలోమీటర్లు) ప్రాజెక్టు ఆగిపోయిందని కేంద్రం స్పష్టం చేసింది. ప్రాజెక్ట్‌లో తన వాటాగా చెల్లించాల్సిన వాటాను ఏపీ ప్రభుత్వం ఇవ్వడం లేదని తేల్చి చెప్పింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ మేరకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
ఈ ప్రాజెక్టు ఖర్చులో 25 శాతం భాగస్వామ్యం చెల్లించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని పేర్కొంది. రూ.2120 కోట్లు వ్యయమయ్యే ఈ ప్రాజెక్టులో ఇప్పటివరకు 1091 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని వెల్లడించింది. ఏపీ ప్రభుత్వం కేవలం తన వాటాగా కేవలం రూ.2.69 కోట్లు మాత్రమే చెల్లించిందని చెప్పింది. ఏపీ ప్రభుత్వం తన వాటాగా 354 కోట్లు చెల్లించాల్సి ఉందని స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటాను ఇవ్వకపోవడం వల్లే ప్రాజెక్టు ఆగిపోయిందని స్పష్టం చేసింది.