“రాజీనామా అంటే ఏంటి సామీ?” అని అడిగే రేంజ్లో మన వైకాపా నేతలు కొత్త డ్రామాకు తెరలేపారు!
సవాల్ నంబర్ 1: “మండలిలో ఎవరైనా చెప్పులు వేసుకుని స్వామివారి ప్రతిమలు పట్టుకున్నది చూపిస్తే రాజీనామా చేస్తా!” అని మాధవరావు గారు గంభీరంగా ప్రగల్భాలు పలికారు.
సీన్ కట్ చేస్తే: సాక్ష్యాలు కళ్లముందు ఉన్నా, ఆ “మాధవుడి” సాక్షిగా ఆడిన మాట తప్పి మౌనవ్రతం పాటిస్తున్నారు.
బొత్సా గారి లాజిక్: “ఎక్కడమ్మా.. మా వారు చెప్పులు వేసుకున్నది ఎక్కడ?” అని వెటకారం చేసిన బొత్సా సత్తిబాబు గారు, ఇప్పుడు సాక్ష్యాలు చూశాక “మొహం చెల్లక” ధర్నాలో కూడా కనిపించడం లేదు.
నేటి స్పెషల్ ఐటెం: “అది మార్ఫింగ్ సామీ!”
శుక్రవారం సవాల్ విసిరారు.. వెంటనే సాక్ష్యాలు దొరికాయి! ఇక చేసేదేముంది? సోమవారం కల్లా.. వైకాపా మార్క్ టెక్నాలజీని వాడేశారు. “అవి ఫోటోలు కావు.. మార్ఫింగ్!” అని కొత్త పల్లవి అందుకున్నారు.
స్వామివారి ప్రతిమను పట్టుకున్నప్పుడు కనీసం చెప్పులు విప్పాలన్న జ్ఞానం లేదు గానీ, తప్పు చేసి దొరికిపోయాక “మార్ఫింగ్” అని బొంకే తెలివితేటలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి!
డియర్ మాధవరావు గారు & బొత్సా గారు..
సిగ్గు, ఎగ్గు అనే పదాలకు మీ డిక్షనరీలో అర్థాలు మార్చేశారా? సాక్ష్యాలతో సహా దొరికిపోయినా ఇంకా ఎదురుదాడి చేస్తూ దైవ ద్రోహులుగా మిగిలిపోవద్దు. ఆ పదవులకు గౌరవం ఇచ్చి తప్పుకోండి!