Suryaa.co.in

Andhra Pradesh

పాల దిగుబడి పెంచడమే ప్రధాన లక్ష్యం

-పాడి రైతులకు ఎన్డీయే ప్రభుత్వ ప్రోత్సాహం
-ఊరూరా పశుగ్రాస క్షేత్రాలకు పచ్చ జెండా
-ఎకరానికి రూ.99 వేలు లబ్ధి
-రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు l

అమరావతి: పేద రైతుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు, పాల దిగుబడి పెంచే లక్ష్యంతో ఎన్డీయే ప్రభుత్వం “ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు” రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ప్రారంభించాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు.

గడిచిన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పాడి రైతులకు తోడ్పాటు అందించేందుకు “ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు” పథకం అమలు చేశారు. కానీ వైసీపీ హయాంలో పథకం అమలు చేయకపోగా పాల సేకరణలో నిబంధనలు విధించి ఇబ్బందులకు గురి చేశారని అన్నారు.

ఉపాధి హామీ పథకంలో ఊరూరా పశుగ్రాస క్షేత్రాల పెంపకం కార్యక్రమాన్ని ఎన్డీయే ప్రభుత్వం అమలు చేస్తోందని, పశుగ్రాసం పెంపకంలో భాగంగా చిన్న & సన్నకారు రైతులు (అనగా 5 ఎకరాలలోపు గల వారికి) ఉన్న పొలములో కనీసం 25 సెంట్లు నుండి 2.5 ఎకరాల వరకు పశుగ్రాసంను పెంచేందుకు దుక్కిదున్నడం, విత్తనము/ గడ్డి కణుపులు నాటడము, నీటిసరఫరా మరియు ఎరువుల కోసం ఆర్థిక ప్రోత్సాహం అందిస్తున్నామని పేర్కొన్నారు.

వేతన మరియు సామాగ్రి ఖర్చు 2 ఏళ్ల కాల వ్యవధిలో ఒక ఎకరానికి రూ.99 వేలు లబ్ధి చేకూరుతుందని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. అర్హులైన ప్రతి రైతుకు అమలు చేయాలని ఉపాధి హామీ, పశు సంవర్ధక శాఖ అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.

LEAVE A RESPONSE