– యస్..గో.. సర్ (ఎస్ ఐ ఆర్)
( తీగల రవీంద్ర)
పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సంబంధిత ఓటర్ లిస్ట్‌ను తనిఖీ చేసే ప్రత్యేక ప్రక్రియ అయిన SIR ( సర్ ) మొదలవ్వగానే బంగ్లాదేశ్ నుండి మయన్మార్ నుండి వచ్చిన అక్రమ వలస దారులు పెద్ద సంఖ్యలో వెనక్కి తిరిగి వెళ్లిపోతున్నారు. ఈ సర్ ప్రక్రియ లో బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOs) ప్రతి ఇంటికి వెళ్లి వోటర్ వివరాలు (ఆధార్, ఐడీ ప్రూఫ్ మొ.) తనిఖీ చేస్తారు. ఈ ప్రక్రియ 2025 నవంబర్‌లో మొదటి వారం లో ప్రారంభమైంది.
ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ బోర్డర్ జిల్లాలలో భారీ సంఖ్యలో గల ఇది అక్రమ వలసదారులు (అంటేఇక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చినవారు)ను గుర్తించడానికి పరోక్షంగా సహాయపడుతోందని అంటున్నారు. ఇండో-బంగ్లా బార్డర్ వెంబడి పెంచిన BSF ప్యాట్రోలింగ్ కారణంగా అక్రమ క్రాసింగ్ ప్రయత్నాలు ఆపబడ్డాయి. అలాగే, ఇక్కడ నుండి వెనక్కి వెళ్లే వారి సంఖ్య పెరుగుతూ ఉండటంతో వచ్చేవారు రావడానికి సంకోచిస్తున్నారు అని BSF వర్గాలు చెబుతున్నాయి.
నవంబర్ 1, న బసిర్హట్ సమీపంలో 15 మంది, హకీంపూర్లో 45 మంది, నవంబర్ 2 న స్వరూప్‌నగర్ సమీపంలో 33 మంది పట్టుబడ్డారు. ఇలా దొరికిన వారిని కోర్టులో హాజరు చేస్తే కోర్టు వారికి, 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది. అరెస్ట్ ల భయంతో నార్త్ 24 పర్గనాలు జిల్లాలోని బిరాటి, బిషార్పారా, బసిర్హట్, హకీంపూర్ వంటి ప్రాంతాల్లో వేలాది మంది బంగ్లాదేశ్ వలసదారులు (ఎక్కువగా డొమెస్టిక్ హెల్పర్లు, లేబర్లు, మహిళలు, పిల్లలు) తమ ఇళ్ల నుంచి పారిపోతున్నారు. వీరు SIRలో గుర్తింపు జరిగితే డీపోర్టేషన్ లేదా అరెస్ట్ భయంతో బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు.
బసిర్హట్ SP హొస్సేన్ మెహదీ రహమాన్ ప్రకారం “అక్రమ క్రాసింగ్లను ఆపడానికి, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం.” అని చెప్పాడు. SIR మీద ఎన్నికల సంఘం సీరియస్ గా ఉండి, తప్పుడు పనులు చేస్తున్న అధికారులపై EC చర్యలు తీసుకుంటూ ఉండటంతో బెంగాల్ అధికారుల ప్రవర్తన లో కూడా కాస్త మార్పు కనిపిస్తోంది. ఈ అక్రమ వలసదారులను CPM ఓట్ బ్యాంక్ గా ఉపయోగిస్తోందని, వారిని వెంటనే వెనక్కి పంపించాలని పార్లమెంట్ లో మమతా బెనర్జీ 2005లో పెద్దగా గొడవ చేసి పేపర్లు చింపి హడావుడి చేసింది.
అంతే కాదు, తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా కూడా సమర్పించింది. విచిత్రం ఏమిటంటే.. అదే మమతా ఇప్పుడు, అదే అక్రమ వలసదారులను ఓట్ బ్యాంక్ గా తయారు చేసుకుని, వారిని వెనక్కి పంపించే ప్రయత్నాలను గట్టిగా వ్యతిరేకిస్తూ బెంగాల్ లో ముస్లింలను రెచ్చగొడుతోంది. ఈ మమత TMC, CPM వంటి పార్టీలకు దేశ భద్రత కంటే మత ఆధారిత ఓటు బ్యాంక్ రాజకీయాలు ముఖ్యం. దేశ భద్రతకు, దేశ ప్రజల ప్రాణాలకు- దేశ ఆస్తులకు ప్రమాదం కలిగించే ఇటువంటి అక్రమవలసదారులను మరియూ వారికి మద్దత్తు ఇచ్చే రాజకీయ నాయకులను సెక్యులరిజం పేరుతో కొందరు హిందూ మేధావులు కూడా వెనకేసుకు రావడం ఈ దేశ ప్రజల దురదృష్టం. అక్రమ వలసదారులు భారీ సంఖ్యలో వెనక్కి వెళ్లిపోతూ ఉండటాన్ని విడియోలలో చూడవచ్చు.

