(చాకిరేవు)
ఆడారుగానీ, అడ్డంగా దొరికారు! బులుగు బ్యాచ్ ‘బుర్రకథలు’ బద్దలయ్యాయి!
వీరు జనానికి ఈడీ ఎంటర్టైన్మెంట్ తో చూపాలనుకున్న సినిమా… ఇప్పుడు అసలైన ఈడీతో మొదలవ్వబోతోంది!
మనుషుల బలహీనతను, అధికారాన్ని అడ్డంగా దుర్వినియోగం చేసి, కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు, జేబులు గుల్ల చేసి… “ఏముందిలే, ఎవడు చూస్తాడులే, దొంగిలించిన కరెన్సీ కట్టలు ఎక్కడ ఉన్నాయో కనుక్కోలేరు” అన్న ధీమాతో, వైకాపా ఇంతకాలం నిస్సిగ్గుగా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది. దొంగల ధీమా ఎక్కువ రోజులు నిలబడదని, చరిత్ర చెబుతోంది కదా!
దోచుకొని దాచిన డంపులో డజను అట్టపెట్టెల్లో.. అక్షరాలా రూ.11 కోట్లు సీజ్ అయ్యాయి! దాని గుట్టు చెప్పింది ఎవరో కాదు.. స్వయంగా ఆ సొమ్మును దాచిన వాడే! వాడికి దాచమని చెప్పిన నిందితుడు జైల్లో ఉన్నాడు. ఇన్నాళ్లూ “ఎవరు చెబుతారులే.. ఎవడు పట్టుకుంటాడులే” అనుకున్న బులుగు బ్యాచ్ గుండెల్లో రాయి పడింది.
దేశం వదిలి పారిపోయిన ఒక్కొక్కడూ ఏ దేశాల్లో దాక్కున్నాడో చెప్పి మరీ… ప్రతి ఒక్కడినీ పట్టుకోడానికి సిట్ (SIT) పొగపెట్టేసరికి, కలుగుల్లో నుండి వచ్చినట్లు దుబాయ్ నుండి వరుణ్ పురుషోత్తం హైదరాబాద్‌లో దిగగానే అడ్డంగా దొరికిపోయి, అరెస్ట్ అయ్యాడు.
“ఈ బులుగు బ్యాచ్ కోసం అనవసరంగా ఇన్నాళ్లూ దాక్కుని అనుభవించింది చాలు” అనుకున్నాడో ఏమో, ఏకంగా ఎక్కడ దాచి పెట్టిందీ చెప్పేశాడు! సమాచారం ఇచ్చిన వరుణ్(రాజ్ కసి రెడ్డి నమ్మినబంటు అంట!) నిజాయితీ మీద నమ్మకంతో సిట్ వెళ్లి చూస్తే.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 11 సీట్లు ఉన్నట్లు, ఈ లిక్కర్ డంపులో 11 కోట్లు దొరికాయి! ఇది ఏదో ఆషామాషీ అట్టపెట్టెలు కాదు.. వాటి మీద “జేకే” (JK) పేరున్న అట్టపెట్టెలను చూసి “జగనే కింగు అని వాటి మీద కూడా స్టిక్కరింగా” అంటా అని జనం నవ్వుకుంటున్నారు!
రూ.11 కోట్లు దొరకగానే, జైల్లో ఉన్న కసి రెడ్డికి గొంతులో తడారిపోయింది. “నా డబ్బులు కావు అవి.. నాకు బెయిల్ రాకుండా చేయడానికే ఆ 11 కోట్లు చూపారు!” అంటూ వెంటనే కోర్టులో పిటిషన్ వేశాడు. అలా చేయకపోతే అసలైన ‘లిక్కర్ డాన్’ నుండి..తలకాయ కూర బాగా వండే బేబక్క నుండి ప్రాణాలకు ముప్పు వస్తుందని భయపడి ఉండవచ్చు. ఈ పిటిషన్ వార్తలను జగన్ సొంత మీడియా సాక్షిలో పదే పదే స్క్రోలింగులు వేసి.. “అవి లిక్కర్ నోట్లు కావు!” అని చెప్పడానికి నానా తంటాలుపడ్డారు.
ఈడీ ఎంటర్టైన్మెంట్ మొదలైంది!
డబ్బు దొరికిన డంపు తీగల బ్రదర్స్ ఫాంహౌస్! సినిమాలు, ఆసుపత్రి, కాలేజీలతో రకరకాల బంధాలు ఈ ‘లిక్కర్ డాన్’కి! కసిరెడ్డి పెళ్లాం తీగల ఆసుపత్రిలో పార్ట్నర్ అట! మధ్యలో యూవీ సినీ లింకులు కూడా ఉన్నాయట! తీగల బ్రదర్స్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలీదు – మీడియాలో ‘పరారీ’ అని వార్తలు.
రాజ్ కసిరెడ్డికి ఎంత లెక్కలేని తనం అంటే, బహుశా ‘బేబక్క’ పెట్టిందేమో ఆ పేరు… ‘ఈడీ ఎంటర్టైన్మెంట్స్’ అని సినిమాల నిర్మాణానికి ఒక సంస్థ పేరును! “లిక్కర్ డబ్బులను తెల్లధనంగా మార్చడానికి ఇలాంటి లాండరింగులు చేస్తారా?! అదీ మా పేరున?” అని కాచుకొని ఉన్నట్లుగా… రూ.11 కోట్ల కట్టలు దొరకగానే, వెంటనే ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) ఎంట్రీ ఇచ్చింది!
తాజా అప్డేట్స్:
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ ఎంట్రీ! రూ.11 కోట్ల సీజ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను కోరింది ఈడీ.
ఏపీ లిక్కర్ కేసులో ఇప్పటికే ఈడీ కేసు నమోదు చేసింది.
రూ.11 కోట్లు సీజ్ కేసులో మరికొందరికి నోటీసులు ఇవ్వనున్న ఈడీ.
మరో వైపు అటు మద్యం కేసులో స్వాధీనం చేసుకున్న రూ.11 కోట్ల నగదుపై సిట్ పిటిషన్ వేసింది. కేసులో ముందుకెళ్లేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని సిట్ తన మెమోలో పేర్కొంది. ఈ పిటిషన్‌పై నేడు విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.
అడ్డంగా జేకే (జగన్ కింగ్) అనే అట్ట పెట్టేల్లో కరెన్సీ కట్టలతో దొరికిపోయినా ఇంకా బుర్రకథలు చెబుతున్న వైకాపా & సాక్షిని చూసి, “ఈ జన్మలో సిగ్గురాదు వీరికి!” అని ప్రజలు పగలబడి నవ్వుకుంటున్నారు. ఇప్పటి వరకు తేలు కుట్టిన దొంగల్లా “సిట్‌తో కుట్ర, కక్ష” అని మూలుగుతున్నారే గాని… సీబీఐ దర్యాప్తు అడగలేదు! అక్కడికి వెళ్తే ‘రాంసింగులు’ వచ్చి కాలవ నీటిలో నుండి గొడ్డలిని తీసినట్లు తీస్తారని వణికిపోతున్నారు!
ఈడీ ఎంటర్టైన్మెంట్ అనే ఎగస్ట్రాలే కాదు.. ‘ప్రెసిడెంట్ మెడల్’ పేరున మద్యం బ్రాండ్ తెచ్చిన వీరి అహంకారం మామూలుగా సాగలేదు. జగన్ ఆడింది ఆటలా సాగింది, అడ్డంగా దొరికే సరికి భయంతో వెంటనే నుదుట సింధూరం బొట్టు కూడా పెట్టుకొని గంగమ్మ ముందు బలిచ్చే మేకపోతు గాంభీర్యంతో కనిపించడంతో జనం మామూలుగా నవ్వడం లేదు!