– వక్ఫ్ చట్టం సవరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తాత్కాలిక ఆదేశాలు ముస్లిం సమాజానికి ఊరట
– వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు వి. ఖాదర్ భాషా
అమరావతి : వక్ఫ్ చట్టం సవరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తాత్కాలిక ఆదేశాలు ముస్లిం సమాజానికి ఊరట. తుది తీర్పులో అల్లాహ్ దయతో ముస్లింలకు శాశ్వత న్యాయం జరగుతుంది. సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయడానికి ఆదేశాలు ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి ముస్లిం సమాజం రుణపడి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ మద్దతుతో ఈ బిల్లు ఆమోదం పొందింది, చంద్రబాబు నాయుడు నిర్ణయం వలనే ముస్లిమేతరులు వక్ఫ్ బోర్డులో సభ్యులుగా వచ్చారని ముస్లి సమాజం ఎప్పటికీ మరిచిపోకూడదు.
మా పార్టీ లోక్ సభలో, రాజ్యసభలో ఎంపీలు వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడారని, ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారని తెలిపారు. ఈ బిల్లుకు అనుకూలంగా టీడీపీ జనసేన పార్టీ ఎంపీలు ఓటు వేశారని, టీడీపీ జనసేన పార్టీలు ముస్లిం సమాజంలో చరిత్ర హీనులుగా నిలిచిపోతారని ఖాదర్ భాషా అన్నారు.
ముస్లిం సమాజానికి ఎప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటారని, ముస్లిం సమాజానికి అన్యాయం కలిగించే ప్రతి అంశంపైన మా పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. గతంలో NRC, CAA విషయంలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయం గుర్తు చేశారు. ఎన్నికల ముందు ముస్లింలకు కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక ముస్లింలకు ఈ విధంగా చేయడం చంద్రబాబు నాయుడు వెన్నుపోటు మార్క్ అని ఖాదర్ భాషా అన్నారు.