Suryaa.co.in

Telangana

దేశం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటోంది

– సంపదను పెంచి పేదలకు పంచాలనేది కేసీఆర్ ధ్యేయం
– సైనికులను ఒక రాష్ట్రం వ్యక్తులుగా చూడకూడదు
– కేసీఆర్ హిందీ భాషా పరిజ్ఞానం పై బీహార్ జర్నలిస్టులు మెచ్చుకున్నారు
– కేసీఆర్ బీహార్ పర్యటన పై బీజేపీ ఐటీ సెల్ చిల్లర ప్రచారం
– అసెంబ్లీ రద్దు అనేది పెద్ద నిర్ణయం
– రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ లు రాజేశ్వర్ రావు, జనార్దన్ రెడ్డి

టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంతో రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఏం మాట్లాడారంటే.. దేశ రాజకీయాల్లో పలు మార్పులు చోటు చేసుకోబోతుతున్నాయి. దేశమంతా తెలంగాణ కేసీఆర్ వైపు చూస్తోంది. ఆగస్టు 26,27,28 తేదీల్లో 26 రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నేతలు సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. తెలంగాణ లో అమలవుతున్న రైతు అనుకూల విధానాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. దేశం లో 93 శాతం సన్న చిన్న కారు రైతులు ఉన్నారు. రైతుల ఉద్యమం మోడీ క్షమాపణ చెప్పే పరిస్థితిని తీసుకొచ్చింది.

మోడీ విధానాలు రైతులు వ్యవసాయం వద్దు అనే వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. కరెంటు మీటర్లు, రైతుల పంటలకు మద్దతు ధర ఇవ్వకపోవడం తదితర అంశాలపై రైతులు మరో ఉద్యమానికి సిద్ధం అవుతున్నారు. దేశం లో కొత్త వ్యవసాయ విధానం రావాలని రైతులను కోరుకుంటున్నారు దేశం లో వ్యవసాయం పండగ కావాలంటే తెలంగాణ మోడల్ అంతటా అమలు కావాలని రైతులు కోరుకుంటున్నారు. కేసీఆర్ తో భేటీ ఆయిన రైతు సంఘాల నేతలకు ఉద్యమాల చరిత్ర ఉంది.

మోడీ కి బీజేపీ కి రైతుల ప్రయోజనాలు పట్టడం లేదు…ప్రతిపక్ష పార్టీ ల ప్రభుత్వాలను కూల్చడమే మోడీ పనిగా మారింది.దేశం లో అంతటా బీజేపీ ప్రభ్యత్వాలు ఉండాలని మోడీ కుట్ర పన్నారు.బీహార్ లో బీజేపీ కుట్ర ను పసిగట్టి నితీష్ కుమార్ ఆ పార్టీ కి దెబ్బ కొట్టి ఆర్ జే డీ తో కలిశారు.అరవింద్ కేజ్రీవాల్ కూడా బీజేపీ కుట్రను భగ్నం చేశారు.ఝార్ఖండ్ లో బీజేపీ కుట్రలు ఎదురుకుని సొరేన్ నిలబడతారని నమ్మకం ఉంది.

ఇక్కడ కూడా చిచ్చు పెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.కేసీఆర్ బీహార్ పర్యటన విజయవంతం అయ్యింది.బీహార్ సీఎం నితీష్ కేసీఆర్ పాలన పై పొగడ్తలు కురిపించారు.మిషన్ భగీరథ లాంటి పథకం తక్కువ కాలం లో అమలు చేసి చూపారని నితీష్ ప్రశంసించడం సంతోషకరం.కేసీఆర్ నాయకత్వాన్ని దేశం కోరుకుంటోంది.తెలంగాణ మోడల్ గుజరాత్ మోడల్ ను తుత్తినియలు చేసింది.ఈ వాస్తవాలని బీహార్ పర్యటన లో కేసీఆర్ మరో మారు స్పష్టం చేశారు.

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.జాతీయ రాజకీయాల్లోకి వచ్చే అంశం పై కేసీఆర్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు.కేసీఆర్ కు అందరి ఆశీర్వాదం ఉంది.సంపదను పెంచి పేదలకు పంచాలనేది కేసీఆర్ ధ్యేయం.దేశ సరిహద్దులను కాపాడుతున్న సైనికులను ఒక రాష్ట్రం వ్యక్తులుగా చూడకూడదు.సైనికులకు సాయం చేయడాన్ని కేవలం సంకుచిత మనస్తత్వం ఉన్న వారే విమర్శిస్తారు.

తెలంగాణ కు చెందిన సైనికులు చనిపోయినప్పుడు కూడా కేసీఆర్ స్పందించి ఆదుకున్నారు.దేశం లో కేసీఆర్ సభలు, సమావేశాల పై ఇంకా నిర్ణయం జరగలేదు.కేసీఆర్ వివిధ రాష్ట్రాల పర్యటన పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు.రైతుల కు సంబంధించి ఒక బలమైన వేదిక ఏర్పాటు అయ్యాకే సభలు సమావేశాలు ఉంటాయి.కేసీఆర్ బీహార్ పర్యటన పై బీజేపీ ఐటీ సెల్ చిల్లర ప్రచారం చేస్తోంది. కేసీఆర్ హిందీ భాషా పరిజ్ఞానం పై బీహార్ జర్నలిస్టులు మెచ్చుకున్నారు.

దమ్ముంటే బీజేపీ జాతీయ నేతలు కేసీఆర్ తో ఏ అంశం పై నైనా చర్చకు రావాలి.తమకు అస్సలు బలం లేని చోట కూడా బీజేపీ ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చాలని ప్రయత్నిస్తోంది.తెలంగాణ లో కూడా బీజేపీ అలాంటి ప్రయత్నం చేస్తే తగిన బుద్ధి చెబుతాం. బీజేపీ నాయకత్వం కుట్రలను ఎప్పటికపుడు చేధిస్తాం.తెలంగాణ ఆత్మ గౌరవం గురించి మాట్లాడటానికి బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కు సిగ్గుండాలి.

ప్రెస్ మీట్ కేసీఆర్ మాట్లాడుతుండగా నితీష్ లేవడం అమర్యాద కాదు.. ఆత్మ గౌరవానికి భంగం కాదు.గుజరాత్ నేతల చెప్పులు మోసిన వారు తెలంగాణ ఆత్మ గౌరవం గురించి మాట్లాడుతారా?కేసీఆర్ దగ్గర బీజేపీ ని ఎదుర్కొనే అస్త్రాలు చాలా ఉన్నాయి. బీహార్ లో కేసీఆర్ వేషధారణ గురించి కూడా బీజేపీ చిలవలు పలువలుగా ప్రచారం చేస్తోంది.మోడీ కి మించిన నటుడు మరెవ్వరూ లేరు.

విద్యుత్ బకాయిల పై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటీసు నిబంధనల ప్రకారం చెల్లదు.కోర్టులో ఈ అంశాన్ని తేల్చుకుంటాం.ap తెలంగాణ కు చెల్లించాల్సిన బకాయిల పై కేంద్రం ఎందుకు మాట్లాడటం లేదు?ఈ నెల 3 న జరిగే టీ ఆర్ ఎస్ ఎల్పీ సమావేశం లో ఎజెండా ఏమిటన్నది ఇదివరకే ప్రకటించాం.ఎజెండా లో లేని అంశాలు కూడా చర్చకు రావచ్చు. బీ ఆర్ ఎస్ దసరా కల్లా రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.అసెంబ్లీ రద్దు అనేది పెద్ద నిర్ణయం.. దీనిపై చెప్పేటంత పెద్ద వాడిని కాదు. కేసీఆర్ భాష లో చెప్పాలంటే నేను జ్యోతిష్యుడిని కాను.

LEAVE A RESPONSE