– ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య
జగ్గయ్యపేట: పౌరులు తమ ఇళ్ళల్లో జాతీయ జెండాను ప్రదర్శించాలని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య
కోరారు. జగ్గయ్యపేటలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని, మాట్లాడారు.
దేశభక్తి భావాన్ని పెంపొందించడం, జాతీయ జెండా ప్రాముఖ్యతపై అవగాహన పెంచడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జాతీయ జెండాను చేత పట్టుకుని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నుండి ర్యాలీగా వెళ్ళారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, కీసర రాంబాబు, అన్నెపాగ ప్రపుల్ల శ్రీకాంత్, కల్లూరి శ్రీవాణి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునరావు, ఎమ్మార్వో నాగరాజు, ఆర్ఐ ఆనంద్, అధికారులు వివిధ పాఠశాలల సిబ్బంది, విద్యార్థినీవిద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.