-తెదేపా నేత వర్ల రామయ్య పిర్యాదుతో వైకాపా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిపై విచారణకు ఆదేశించిన నేషనల్ ట్రైబల్ కమీషన్
-నెల్లూరు జిల్లా, ఆత్మకూరు మునిసిఫల్ చైర్ పర్సన్ అయిన గిరిజన మహిళ వెంకటరమణమ్మను -పత్రికా సమావేశంలో నిలబెట్టి అవమానించిన పిర్యాదుపై దర్యాప్తు
జగన్ మోహన్ రెడ్డి పాలనలో కులవివక్ష కోరలు విప్పి బుసలు కొడుతోంది. ఇటీవల ఆత్మకూరు వైకాపా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పత్రికా సమావేశంలో అందరూ కూర్చుని ఆత్మకూరు మునిసిఫల్ చైర్ పర్సన్ వెంకటరమణమ్మ అనే గిరిజన మహిళను నిలబెట్టి అవమానించారు. ఆత్మకూరుకు ప్రధమ మహిళ వెంకటరమణమ్మ యానాది కులానికి చెందిన మహిళ అయినందుకే ఎమ్మెల్యే ఆమెకు కుర్చీ వేయలేదు. తనకు కుర్చీ వేయాలని రెండుసార్లు అడిగినప్పటికీ ఆమెకు కుర్చీ ఏర్పాటు చేయలేదు. దీనితో ఆమె ఎంతో మనోవేదనకు గురై కన్నీళ్లు పెట్టుకుంది. దీనిపై తెదేపా నేత వర్ల రామయ్య ఏప్రిల్ 28 న నేషనల్ ట్రైబల్ కమీషన్ లో పిర్యాదు చేశారు. గిరిజన మహిళను నిలబెట్టి అవమానించడం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం మార్గదర్శకాలను ఉల్లంఘించడమే. గిరిజన మహిళను అవమానించిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం సెక్షన్ -3 ప్రకారం శిక్షార్హం అని పిర్యాదులో పేర్కొన్నారు. పిర్యాదును విచారణకు స్వీకరిస్తున్నామని వర్ల రామయ్యకు కమీషన్ సమాచారం ఇచ్చింది.
విక్రమ్ రెడ్డి చట్టాలను ఉల్లంఘించడం దారుణం: తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
శాసనసభ సభ్యుడిగా ఉన్న మేకపాటి విక్రమ్ రెడ్డి చట్టాలను ఉల్లంఘించడం దారుణం. గిరిజన మహిళకు న్యాయం చేసే విధంగా ట్రైబల్ కమీషన్ పిర్యాదుపై విచారణకు ఆదేశించడం స్వాగతిస్తున్నాం. ఇప్పటికైన వైసీపీ ప్రభుత్వం, వైసీపీ ప్రజాప్రతినిధులు తమ ధోరణి మార్చుకుని చట్టబద్దంగా వ్యవహరించాలి. కులాలకు అతీతంగా ఎవరికి ఇవ్వవలసిన గౌరవం వారికివ్వాలి.