– బీజేపీ స్టేట్ ఆఫీసు వద్ద జరిగిన సంబరాల్లో ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ: ఉప రాష్ట్రపతి గా ఎన్డీయే అభ్యర్థి గెలుపొందడంపై ఏపీ బీజేపీ నేతల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యాలయం వద్ద బాణసంచా కాల్చారు. కార్యకర్తలకు మిఠాయి పంపిణీ చేశారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి, రాష్ట్ర ఆర్గనైజేషనల్ సెక్రటరీ మధుకర్ జీ, జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రాం, స్టేట్ హెడ్ క్వార్టర్స్ ఇంఛార్జి ఉప్పలపాటి శ్రీ నివాస్ రాజు , మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ బాషా,రాష్ట్ర కార్యదర్శి బొడ్డు నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడారు.
ఉప రాష్ట్రపతి ఎన్నికలో యన్డీయే అభ్యర్థి పొన్నుస్వామి రాధాకృష్ణన్ విజయం సాధించారు. ఎంపీలు అందరికీ కృతజ్ఞతలు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిన ఎన్నికలో స్వేచ్ఛగా ఓటు ఉపయోగించుకున్నారు. నరేంద్ర మోడీపాలన పై నమ్మకం తో ఓట్లు వేసిన ఎంపీలు అందరికీ ధన్యవాదాలు. భారతదేశంలో యన్డీఎ కూటమి ఇంకా వర్ధిల్లుతుంది. తప్పకుండా ప్రజల ఆకాంక్ష ల మేరకు యన్డీఎ పాలన సాగుతుంది. కొత్తగా ఎన్నికైన ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ కు ఏపీ బిజెపి తరపున నా శుభాకాంక్షలు అని తెలిపారు.
గుంటూరులో జీఎస్టీ పండగ!
– జీఎస్టీ రేట్లు తగ్గించిన ప్రధాని నరేంద్ర మోడీకి క్షీరాభిషేకం
గుంటూరు: గుంటూరు జిల్లా బిజెపి అధ్యక్షులు చెరుకూరు తిరుపతిరావు ఆధ్వర్యంలో జిఎస్టి రేట్లు తగ్గించినందుకు, ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణ ఎన్నికలలో దాని విజయం సాధించినందుకు విజయోత్సవ ర్యాలీ జరిపారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతి రావు మాట్లాడుతూ
ప్రధాని నరేంద్ర మోడీ దూర దృష్టి గల నాయకత్వంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మా సీతారామన్ సమర్థవంతమైన చర్యలతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల పలు వస్తువులు సేవలపై జిఎస్టి తగ్గించే నిర్ణయం తీసుకోవడం ప్రజలకు గొప్ప ఊరట కలిగిస్తుందని అన్నారు. అలాగే ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణ ఎన్నికలలో విజయం సాధించినందుకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. బ్రాడీపేట సింధూరి హోటల్ నుండి శంకర విలాస్ సెంటర్ వరకు నిర్వహించారు. ర్యాలీ అనంతరం టపాసులు కాల్చి ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి దర్శనం శ్రీనివాస్, పల్నాడు జిల్లా ఇన్చార్జి కొక్కెర శ్రీనివాస్ యాదవ్, ఈదర శ్రీనివాస్ రెడ్డి,పాలపాటి రవికుమార్, బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ వెలగలేటి గంగాధర్, చరక కుమార్ గౌడ్,.వై. వి. సుబ్బారావు, జిల్లా ప్రధాన కార్యదర్సులు బజరంగ్ రామకృష్ణ,దేసు సత్యనారాయణ, శ్రీనివాసరావు, తోట శ్రీనివాసరావు,జిల్లా ఉపాధ్యక్షులు వంగివరపు విమల దేవి,కత్తి మేరీ సరోజిని, కార్యదర్సులు క్రిష్టిపాటి నారాయణరెడ్డి, నారదాసు వీరమణి,సురేష్ జైన్, దానబోయిన శివయ్య, మోర్చా అధ్యక్షులు నడ్డి నాగమల్లేశ్వరి యాదవ్, ధార అంబేద్కర్, మండల అధ్యక్షులు గాయత్రీ బెహరా, తంగా లక్ష్మణరావు, పాలెం వెంకట పుల్లారావు, మల్లాల లక్ష్మణ్ గౌడ్, కంచర్ల రాజేష్ నాయకులు అనుమోలు ఏడుకొండల గౌడ్, బూసి స్టాలిన్, జితేంద్ర గుప్తా, పురుషోత్తం, కోలా రేణుకాదేవి, దుర్గా ప్రసాద్, సాంబయ్య గౌడ్, కామేపల్లి వెంకటేశ్వర్లు, రామచంద్ర రావు, శోభన్ బాబు,కొర్రా శ్రీను నాయక్, ప్రతాప ప్రసాద్, ప్రవీణ్,రమణ,సాయి, యస్వంత్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.