– ఏపీ టిడిపి అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకి మంత్రి లోకేష్ అభినందనలు
మంగళగిరి: ఏపీ టిడిపి నూతన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశంపార్టీకి- ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ, ప్రజాసంక్షేమానికి కృషి చేయాలని మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు.
టిడిపి కేంద్ర కార్యాలయం మంగళగిరి ఎన్టీఆర్ భవన్‌లో శుక్రవారం నూతన అధ్యక్షుడి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షుడిగా బీసీ నేత పల్లా శ్రీనివాసరావుని ఎంపిక చేయడం తెలుగుదేశం పార్టీ బీసీలకు ఇచ్చే ప్రాధాన్యతకు మరో నిదర్శనం అని పేర్కొన్నారు. నేతలు-కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరుతూ మంత్రి లోకేష్ నూతన అధ్యక్షుడికి అభినందనలు తెలిపారు.