Suryaa.co.in

Andhra Pradesh

నేరాలను అడ్డుకోవాల్సిన అధికారులే నేరాలు చేస్తున్నారు

-జగన్ పుణ్యమా అని నేరాలను అడ్డుకోవాల్సిన అధికారులే నేరాలు చేస్తున్నారు
– ట్విట్టర్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు

మొదట పోలీసులు మా పార్టీ వారిపై అక్రమ కేసులు బనాయించడం, పిమ్మట ఎదుటి పార్టీ వారికి గాయాలు లేకున్నా తీవ్ర గాయాలు అంటూ వైద్యులు నివేదిక ఇవ్వడం, ఆ వైద్యుల నివేదికతో కోర్టులో, బెయిల్ ఇవ్వొద్దు అని జడ్జ్ ను కోరడం.. ఇది కొందరు వైద్యులు, అధికారులు చేస్తున్న నేరం.తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలను రాష్ట్ర పోలీసులు ఏ విధంగా హింసిస్తున్నారు అనే దానికి ఇవి ప్రత్యక్ష ఉదాహరణలు.

మూడేళ్ళుగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను ఇష్టానుసారం ప్రయోగించారు. వైసీపీ నేతలు, ప్రభుత్వ వైద్యులు, పోలీసులు ఒక మాఫియాగా ఏర్పడి తెలుగుదేశం వారిని చిత్రహింసలకు గురి చేస్తున్నారు.ఇవి ఖచ్చితంగా తాడేపల్లి నుండి వచ్చిన ఆదేశాలే. ప్రతిపక్షాన్ని పూర్తిగా బలహీనపరచాలి అన్న ఉద్దేశ్యం తోనే ఈ నేరాలకు పాల్పడ్డారు. రాజ్యాంగానికి, చట్టానికి లోబడి పని చేయకుండా.. ఇలా ఎవడెవడు, ఇంకెవడి ఆదేశాలతోనో, మరింకొకడు ఎవడినో తృప్తి పరచడానికి ఇలాంటి పనులు అన్నీ చేశారో.. ఆ అందరికీ త్వరలోనే చట్టాలకు లోబడి శిక్షలు ఉంటాయి. ఉండేలా చూడటం మా బాధ్యత. ప్రతి ఒక్కడి సంగతీ తేలుస్తాం.

LEAVE A RESPONSE