టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
వైసిపి ఇసుకాసురుల దెబ్బకు పెన్నానది విలవిలలాడుతోంది. పత్రికలు ఘోషిస్తున్నా, ప్రజలు మొరపెట్టుకుంటున్నా వైకాపా ఆగడాలు ఆగడం లేదు. ఇది బద్వేలు నియోజకవర్గంలోని లింగాలకుంట వద్ద పెన్నానది ఇసుక కోసం వెళ్తున్న టిప్పర్ లారీ. ఇసుక లోడ్ చేసుకున్నాక ఎక్కడికి తీసుకెళ్తారని అడిగితే బెంగుళూరు వెళ్తామని డ్రైవర్ సమాధానమిచ్చారు. ఇక్కడ ఇసుక కూతవేటు దూరంలోని గ్రామప్రజలకు దొరకదు కానీ, చెన్నయ్, బెంగుళూరులో మాత్రం విరివిగా దొరుకుతుంది. జలగన్న పాలనలో జనం ఇంకా ఎన్ని సిత్రాలు చూడాలో…!