Suryaa.co.in

Telangana

గుజరాత్ లో వృద్దులకు ఇస్తున్న పెన్షన్ కేవలం 750 రూపాయలు మాత్రమే

– తెలంగాణలో నెలకు వెయ్యి కోట్ల రూపాయలు పెన్షన్లు
– కొత్త పెన్షన్లు మంజూరు చేసిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్
– మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
– నిజామాబాద్ నగరంలో వెయ్యి మంది లబ్ధిదారులకు పెన్షన్ పత్రాలు అందజేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,అర్బన్ ఎమ్మేల్యే బిగాల గణేష్ గుప్తా
-ఎమ్మేల్యే బిగాలతో కలిసి లబ్ధిదారుల తో కలిసి సహపంక్తి బోజనాలు చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

గుజరాత్ లో 15 ఏళ్లు మోది సీఎంగా పనిచేశారు. ఇప్పుడు కూడా బిజెపి అధికారంలో ఉండి కానీ అక్కడ వృద్దులకు ఇస్తున్న పెన్షన్ కేవలం 750 రూపాలు మాత్రమే.వికలాంగులకు గుజరాత్ లో 600 ఇస్తే మనదగ్గర కేసీఆర్ 3000 ఇస్తున్నారు.మనకంటే రెట్టిపు జనాభా ఉన్న గుజరాత్ లో కేవలం 13 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నారు..కానీ మన దగ్గర 48 లక్షల మందికి . అయినా బిజెపి నేతలు నోటికి వచ్చినట్లు మొరుగుతున్నరు.. దమ్ముంటే తెలంగాణలో ఇస్తున్నన్నన్ని పెన్షలు ఇచ్చి తొడ కొట్టాలి ‘‘ అన్నారు.

ఇంకా ప్రశాంత్‌రెడ్డి ఏమన్నారంటే.. ఇలా బిజెపి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒక్కదగ్గర కూడా తెలంగాణలో ఇస్తున్నానని పెన్షన్లు ఇష్టలేరు..ఇది ప్రజలు గమనించాలి.ఇచ్చిన మాట మేరకు ఎన్ని ఇబ్బందులున్నా కొత్త పెన్షన్లు మంజూరు చేసిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్..నిజామాబాద్ నగరం ఆశ్చర్య పోయే విధంగా అభివృద్ధి జరుగుతుంది..ఇందుకు ప్రభుత్వ కృషి తో పాటు ఎమ్మేల్యే కష్టం చాలా ఉంది.బిజెపి,కాంగ్రెస్ నేతలు పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారు.

ప్రజలు గమనించాలి..
కేసీఆర్ ముఖ్యమంత్రి కాకున్న ముందు రాష్ట్రం లో వచ్చిన పెన్షన్లు 22లక్షల మంది కి మాత్రమే..కానీ ఇపుడు వస్తున్న పెన్షన్ల సంఖ్య 48 లక్షలు.నెలకు వెయ్యి కోట్ల రూపాయలు పెన్షన్లు ఇస్తున్నారు.అంటే గతం కంటే 10 రెట్లు ఎక్కువ.ఇంకా ఇపుడు మంజూరైన 10 లక్షల కొత్త పెన్షన్లు కలుపుకొని 12 వేల కోట్లు పెన్షన్లు ఇస్తున్నారు.ఇది వాస్తవం కాదా. దైవ ప్రమాణంగా ఇది వాస్తవం.ప్రజలు గమనించాలి. గతంలో లేని ఒంటరి మహిళలకు , బోదకాలు వారి కి కూడా పెన్షన్లు ఇస్తున్నాము..
కేసీఆర్ లాగా ఇతర 28 రాష్ట్రాలకు కూడా ముఖ్యమంత్రులు ఉన్నారు..ఇందులో 18 మంది బిజెపి సీఎం లు ఉన్నారపెన్షన్ల తక్కువ చేసేందుకు, 24 గంటల కరెంటు కట్ చేసేందుకు, రైతు బంధు బంద్ చేసేందుకు తెలంగాణకు వస్తమంటున్నారు బిజెపి, కాంగ్రెసోళ్లు. వాళ్ళని ఇక్కడ అధికారంలోకి రాణిస్తే వాళ్ల పాలిత రాష్ట్రాల్లోలాగే ఇక్కడ 500, 600 వందలే ఇస్తారు.ప్రజల బాధ తెలిసిన వ్యక్తి మన కేసీఆర్.ప్రతి ఒక్కరి మొఖాల్లో చిరునవ్వే సీఎం కేసీఆర్ కోరుకునేది.

ఎమ్మేల్యే బిగాల గణేష్:
దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ గారికి లబ్ధిదారుల తరపున ధన్యవాదాలు.అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం.యావత్ తెలంగాణ ఎప్పుడు సీఎం కేసీఆర్ వెంటనే నడుస్తమంటున్నరు.ఇచ్చిన మాట మేరకు నిజామాబాద్ నగరంలో 9 వేల కొత్త పెన్షన్లు మంజూరు.

LEAVE A RESPONSE