– వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు
– చంద్రబాబునాయుడు ఎప్పుడూ ఇతరులపై ఆధారపడే తత్వం
– ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వద్ద మీడియాతో మాట్లాడిన వైయస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి:
– రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు విపక్షాలన్నీ కలిసి రావాలని, అవసరమైతే తాము త్యాగాలకూ సిద్ధమని తెలుగుదేశం పార్టీ జాతీయ అ«ధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన విజయసాయిరెడ్డి
ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ఏం మాట్లాడారంటే..
ఎవ్వరితోనూ పొత్తు అవసరం లేదు:
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే భయపడుతున్నారో, ఎవరికైతే ప్రజల మద్దతు లేదో, వారు ఇంకొకరి మద్దతు కోసం ఎదురు చూస్తుంటారు.
చంద్రబాబునాయుడులో విశ్వాసం లేదు. ఆయన పట్ల ప్రజలకు విశ్వసనీయత లేదు. ఎప్పుడూ ఇతరులపై ఆధారపడే తత్వం. ఇతరుల మీద ఆధారపడి, వారిని మోసగించి వెన్నుపోటు పొడిచే తత్వం. కాబట్టి చంద్రబాబు పట్ల ప్రజల్లో విశ్వాసం లేదు.
నిస్సందేహంగా..:
వచ్చే 20, 25 సంవత్సరాల పాటు జగన్ ముఖ్యమంత్రిగా ఉంటారు. వైయస్సార్సీపీనే అధికారంలో ఉంటుంది. దాంట్లో సందేహం లేదు. ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకున్నప్పటికీ, వైయస్సార్ కాంగ్రెస్కు గతంలో కంటే ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయి. ఓట్లు కూడా ఎక్కువే వస్తాయి.
చంద్రబాబును ప్రజలే వదిలించుకున్నారు:
ప్రజలే చంద్రబాబును దించేశారు. చంద్రబాబు మనస్తత్వం దుర్మార్గమైంది. వెన్నుపోటు పొడిచే మనçస్తత్వం. ఆయనకు నిలకడ లేదు. అధికారం దాహం తప్ప, తన సామాజిక వర్గాన్ని పెంచుకోవడం తప్ప. ప్రజలంతా నా మనుషులు. ప్రజలంతా çసుఖ సంతోషాలతో ఉండాలి. కులాలు, మతాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధి జరగాలి. ప్రతి కుటుంబంలో సంతోషం చూడాలన్న భావన చంద్రబాబులో ఏనాడూ లేదు. ఆయన అధికారం వదులుకోవడం కాదు. ప్రజలే ఆయనను వదిలించుకున్నారు. దీన్ని చంద్రబాబు అర్ధం చేసుకోవాలి.
వారే ఆ నేరస్తులు:
టీడీపీ కార్యకర్తలు నాయకులే అత్యాచారాలు చేస్తున్నారు. ఇది ముమ్మాటికి నిజం. ఇవాళ సమాజంలో అశాంతి, అకృత్యాలు, ముఖ్యంగా నేరాలు ఎవరైనా చేస్తున్నారంటే, అది తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేత, కొందరు గుండాలకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించి, క్రిమినల్ చర్యలకు పాల్పడుతున్నారు. ఆ విధంగా దుష్ప్రచారం చేసి, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేయాలని చూస్తున్నారు. భగవంతుడు ఆయనను తప్పకుండా శిక్షిస్తాడని విజయసాయిరెడ్డి అన్నారు.