• ఆళ్లగడ్డ నియోజకవర్గం భాగ్యనగరం గ్రామ ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
• మా గ్రామం ఏర్పడి 60సంవత్సరాలైంది. ముస్లింలు, దూదేకులకు నేటికీ శ్మశానవాటిక లేదు.
• 5కిలోమీటర్ల దూరంలో ఉన్న పక్క గ్రామం పేరాయిపల్లెలోని శ్మశానానికి వెళ్లి అంత్యక్రియలు నిర్వహించాల్సి వస్తోంది.
• మా గ్రామంలో మంచినీటి సమస్య అత్యధికంగా ఉంది. బోర్లు వేస్తే ఉప్పు నీరు వస్తోంది. చిన్న నీటి కుంట ద్వారా అవసరాలు తీర్చుకుంటున్నాం.
• గతంలో మాకు చింతకుంట నుండి పైపులైన్లు వేశారు. కానీ విద్యుత్ సౌకర్యం లేక నీరు అందడంలేదు.
• పాత వాటర్ ట్యాంకు స్థానంలో సామర్థ్యం పెంచి కొత్తది ఏర్పాటుచేయాలి.
• మా గ్రామాన్ని పంచాయతీగా ఏర్పాటు చేయాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గ్రామసీమలను పూర్తిగా నిర్వీర్యం చేశారు.
• గ్రామపంచాయితీలకు చెందిన 8,660 కోట్ల రూపాయల నిధులను జగన్ ప్రభుత్వం దొంగిలించడంతో గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా నిధుల్లేని దుస్థితి నెలకొంది.
• టిడిపి అధికారంలోకి వచ్చాక భాగ్యనగరంలో ముస్లిం శ్మశాన వాటికకు స్థలం కేటాయిస్తాం.
• వాటర్ ట్యాంకు సామర్థ్యాన్ని పెంచి ఇంటింటికీ తాగునీటి కుళాయి అందించే ఏర్పాటుచేస్తాం.
• భాగ్యనగరాన్ని ప్రత్యేక పంచాయితీగా ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలిస్తాం.