Suryaa.co.in

Telangana

తెలంగాణ చూపు బీజేపీ వైపు

-గిరిజనులకు ఇచ్చిన హామీలేవీ అమలు చేయని కేసీఆర్ ప్రభుత్వం
-బీజేపీ ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీలో కన్వీనర్ గరికపాటి మోహన్ రావు విమర్శ

టీఆర్ఎస్ పాలనపట్ల విసిగి వేసారని తెలంగాణ ప్రజలు ప్రత్యామ్నాయంగా బీజేపీవైపు చూస్తున్నారని పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ కన్వీనర్ గరికపాటి మోహన్ రావు అన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 5 ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల కార్యకర్తల సమావేశం ఈరోజు కొత్తగూడెంలో నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ(చిన్ని) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గరికపాటి మోహన్ రావు ప్రసంగించారు.అందులోని ముఖ్యాంశాలు…

గడిచిన ఏడేళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలేవీ అమలు చేయలేకపోయింది. పోడు భూములకు పట్టాలిచ్చే కార్యక్రమాన్ని తానే స్వయంగా ప్రారంభిస్తానని ఎన్నికల్లో హామీలిచ్చిన సీఎం ఆ
mohanrao-display ఊసే ఎత్తడం లేదు.కేసీఆర్ మాట్లాడేవన్నీ ఝూటా మాటలే. నిరుద్యోగ ఖాళీల భర్తీ లేదు. గిరిజన యూనివర్శిటీ ఏర్పాటుసహా గిరిజన ప్రాంతాల అభివ్రుద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది శూన్యం. ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పూర్తిగా దారి మళ్లించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సబ్ ప్లాన్ నిధుల మళ్లింపుపై పూర్తి స్థాయి జరపాలి.

ఉట్టికి ఎగరలేనోడు..ఆకాశానికి ఎగురతానన్నట్లుగా తెలంగాణను అభివ్రుద్ధి చేయలేనోడు దేశాన్ని బంగారు భారత్ చేస్తాననడం హాస్యాస్పదం. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా బీజేపీదే విజయమనే సంగతి
mohanrao2 కేసీఆర్ కు తెలిసిపోయింది. బీజేపీని బదనాం చేసేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని… పదేపదే బీజేపీపై అక్కసు వెళ్లగక్కుతున్నారు.రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఎదుర్కొనేందుకు బీజేపీ శ్రేణులు సంసిద్ధంగా ఉండాలని, దీనికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో నిర్మాణాన్ని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, కమిటీ సభ్యులు చాడ సురేష్ రెడ్డి, కూన శ్రీశైలంగౌడ్, కటకం మృత్యుంజయం, సుహాసినీరెడ్డి, చింతా సాంబమూర్తి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎ.రాకేశ్ రెడ్డి, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ నాయక్ తదితరులు పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

LEAVE A RESPONSE