హైదరాబాద్ కు చెందిన, అలర్జీ సూపర్ స్పెషలిస్ట్ , పల్మనాలజిస్ట్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ jan 20 2023 ఫిబ్రవరి: ప్రైమ్ మినిస్టర్ కి స్వయాన ఒక లెటర్ రాసి పంపించారు.
కరోనా వ్యాక్సిన్ వలన అనర్థాలు చాలా వస్తున్నాయని, కరోనా వ్యాక్సిన్ ఎవరికి అవసరమో వారికి ఇస్తే సరిపోతుంది అంతకు మించి మా MASS VACCINATION ప్రోగ్రామ్ కింద అవసరం లేదని, తన వైద్యపరమైన, అనుభవంతో కూడిన శాస్త్రీయ అభిప్రాయాన్ని డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ తెలిపారు.
అలర్జీ పేషెంట్లు దేశంలో 30cr ఉన్నారని, వీరికి భారత ప్రభుత్వం ఆరోగ్య శాఖ నియమావళి ప్రకారము వ్యాక్సిన్ తొందరపడి తీసుకోవద్దని ఉందని, కానీ దురదృష్టవశాత్తూ, ఇటువంటి సమాచారం ప్రజలకు తెలియని కారణంగా, చాలామంది అలర్జీ రోగులు వాక్సినేషన్ తీసుకున్నారని, తదనంతరం వివిధ రకాలైన ఎలర్జీలు పెరగడం, కొంతమంది ఆటోఇమ్యూనిటీ కండిషన్ తోని బాధపడుతున్నారని డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ వెల్లడించారు.
ప్రధానమంత్రికి రాసిన తన ఉత్తరం కి సమాధానంగా ప్రధానమంత్రి కార్యాలయం సమాచార పట్టిక విడుదల చేసింది, కరోనా వ్యాక్సిన్ అందరూ కచ్చితంగా తీసుకోవాలని లేదని, కావాలనుకుంటే తీసుకోవచ్చు వద్దనుకుంటే మానచ్చని వెల్లడించింది.
డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర రాసిన ఉత్తరానికి ప్రతిస్పందనగా, ఆరోగ్యశాఖ కోవిడ్ నియంత్రణ విభాగం, ప్రైమ్ మినిస్టర్ కార్యాలయం, ఆరోగ్యశాఖ ఉత్తరంలో ఉన్న శాస్త్రీయమైన సమాచారాన్ని క్షుణ్ణంగా పరిగణలోకి తీసుకొని పరిశోధిస్తున్నారు అని తెలిపింది.