– మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు
విజయవాడ: వాస్తవ చిత్రాలను తన అక్షర అస్త్రాలుగా రచనలు చేసిన మహోన్నత వ్యక్తి, మొట్టమొదటి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ నేడు మనకు ఆదర్శమూర్తి అని మాజీ శాసనసభ్యులు సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సమన్వయకర్త మల్లాది విష్ణు కొనియాడారు.
శ్రీ విశ్వనాథ సత్యనారాయణ జయంతిని పురస్కరించుకుని బుధవారం గవర్నర్ పేట లెనిన్ సెంటర్ నందు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పూలమాల వేసి ఘనముగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠం అవార్డు గ్రహీత అయిన ఆయన ‘కవి సామ్రాట్’ బిరుదాంకితులనీ, ఆయన రాసిన ‘రామాయణ కల్పవృక్షము’ అనే రచనకు జ్ఞానపీఠం అవార్డు లభించిందన్నారు.
ఆయన కవిత్వం, నవలలు, నాటకాలు, చిన్న కథలు, ప్రసంగాలు వంటి అనేక సాహిత్య ప్రక్రియలలో విస్తృతమైన రచనలు చేశారని చెప్పారు.ఆయన విజయవాడలో ఎస్ఆర్ఆర్ కాలేజీ లో పనిచేశారని ఆయన మన విజయవాడ వాసి అని చెప్పారు. తెలుగు సాహిత్య చరిత్రలో తన స్థానాన్ని పదిలపరచుకొని, పదితరాల వరకు కావలసిన తెలుగు వాఙ్మయాన్ని, అభ్యదయ కవులకు, సంప్రదాయ కవి శ్రేష్ఠులకు ఎంతో స్ఫూర్తిని అందించిన మహనీయుడు విశ్వనాథ సత్యనారాయణ అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో శార్వాణి మూర్తి , చల్లా సుధాకర్ , దమ్మాల చంద్ర శేఖర్ , తాడి శివ, వీరారెడ్డి , మొగ్గల్ల నాగభూషణం ,అలుగోలు కరుణాకర్, పేరూరి ప్రేమ్ కుమార్, నామాల శ్రీనివాసరావు, (పాపయ్య) ఓబిరెడ్డి వెంకట్ రామిరెడ్డి , మీసాల సత్యనారాయణ, వీరవల్లి ఆచారి, రాము, బెవర శ్రీను, తదితరులు పాల్గొన్నారు.