Suryaa.co.in

Andhra Pradesh

పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాయకుండా దర్యాప్తు చేయాలి

– బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

రేపల్లె లో అమర్నాథ్ గౌడ్ ను అత్యంత పాశవికంగా హత్య చేశారు.డీజీపీ ఈకేసును స్పెషల్ కేసు గా పరిగణించి వేగవంతంగా శిక్ష పడేవిధంగా చర్యలు తీసుకోవాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కి కేసు బదలాయింపు చేయాలి. ఆకతాయిలు,రౌడీలకు అధికార పార్టీ నేతలు అండగా ఉన్న సంకేతాలు ఉండడం వల్ల ఇలాంటి ఘటనలు కు పాల్పడుతున్నారు.నేరస్తులు పోలిస్టేషన్ లో ఉండగా అధికార పార్టీ నేతలు వెళ్ళడం దేనికి సంకేతం? పోలీసులు అధికార పార్టీ కి కొమ్ము కాయకుండా ఈకేసులో దర్యాప్తు చేయాలి. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు వెంట జిల్లా ఇంఛార్జి అడ్డూరి శ్రీ రాం, బిజెపి అధికార ప్రతినిధి చందు సాంబశివరావు, స్థానిక బిజెపి నేతలు ఉన్నారు.

LEAVE A RESPONSE