Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిద్రపోతుంది

– కళ్ల ముందే మనిషిని చంపుతుంటే పోలీసులు ఆపలేరా?
– మాజీ మంత్రి పేర్ని నాని

అమరావతి: ఎస్‌ఐ, కానిస్టేబుళ్ల కళ్లెదుటే శ్రీశైలం నియోజకవర్గం సీతారామపురంలో వైయస్ఆర్ సీపీ నేత పసుపులేటి సుబ్బారాయుడిని (65 ) ఇంట్లో నుంచి బయటికి లాగి టీడీపీ నాయకులు అతి దారుణంగా చంపిన వైనం.నడిరోడ్డుపై హత్యలు, దాడులు చేస్తుంటే పోలీసులు కనీసం గాల్లోకి కూడా కాల్పులు జరపలేదు. ఏపీలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయింది గతంలో బీహార్,ఉత్తరప్రదేశ్ లో రాజకీయ ప్రేరేపిత దాడులు జరిగేవి.. ఇప్పుడు అలాంటి సంస్కృతిని కూటమి ప్రభుత్వం ఏపీకి తీసుకువచ్చింది.

LEAVE A RESPONSE